Begin typing your search above and press return to search.

టాలీవుడ్ 'లోకేష్' ఎవరు..?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూలీతో మరోసారి తన టాలెంట్ చూపించాలని చూస్తున్నాడు.

By:  Ramesh Boddu   |   11 Aug 2025 7:00 PM IST
టాలీవుడ్ లోకేష్ ఎవరు..?
X

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూలీతో మరోసారి తన టాలెంట్ చూపించాలని చూస్తున్నాడు. ఖైదీ, విక్రం సినిమాలతో లోకేష్ డైరెక్షన్ స్టామినా ఏంటో అర్ధమైంది. ఐతే ఇప్పుడు కూలీతో రాబోతున్నాడు లోకేష్. కూలీలో రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ అంతా కూడా నటించారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ మూవీ వస్తుంది. ఐతే ఈ సినిమాతో రజినీకి సూపర్ ఎలివేషన్స్ ఇస్తున్నాడు లోకేష్.

విక్రం లో కమల్ హాసన్..

అదేంటో లోకేష్ సినిమాల్లో హీరోలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అతను రాసుకునే క్యారెక్టర్స్ అలా ఉంటున్నాయి. ఖైదీలో కార్తి కానీ, విక్రం లో కమల్ హాసన్ ఇప్పుడు కూలీలో రజినీకాంత్ ని కానీ ట్రైలర్ చూస్తుంటేనే ఇదేదో భారీ విస్పోటనం అనేలా ఉంది. అతనితో వర్క్ చేశాడు కాబట్టే లోకేష్ ని రాజమౌళి తో పోల్చాడు రజినీకాంత్. ఈమధ్యనే జరిగిన కూలీ తెలుగు ప్రెస్ మీట్ లో రజినీ వీడియో మెసేజ్ లో తెలుగులో రాజమౌళి ఎలాగో తమిళ్ లో లోకేష్ అలా అన్నారు.

అక్కడ లోకేష్ రాజమౌళి అయితే మరి ఇక్కడ లోకేష్ ఎవరన్నది క్లారిటీ రావట్లేదు. తెలుగులో కూడా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్స్ ఉన్నారు. వాళ్ల సూపర్ కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవికి తగిన సినిమా పడట్లేదు అన్న టాక్ ఫ్యాన్స్ లో ఉంది. మరి తెలుగులో లోకేష్ లాంటి డైరెక్టర్ ఎవరు చిరంజీవితో సినిమా చేస్తారు. అతను ఎవరన్నది గుర్తించాల్సిన అవసరం ఉంది.

టాలెంటెడ్ డైరెక్టర్స్ కి కొదవేం లేదు..

టాలీవుడ్ లోకేష్ ఎవరు అంటే ఇక్కడ టాలెంటెడ్ డైరెక్టర్స్ కి కొదవేం లేదు. కానీ సరైన టైం కి సరైన మూవీ పడాలి అంతే. తప్పకుండా లోకేష్ కాదు అంతకుమించే సినిమాలే చేసే డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారని ప్రూవ్ అవుతుంది. లోకేష్ సినిమాల్లో ప్రత్యేకత ఏంటంటే స్టార్ క్యామియోస్ అది కూడా పవర్ ఫుల్ రోల్స్ తో చూపిస్తాడు. అందుకే లోకేష్ కనకరాజ్ తమిళ్ లో సినిమాలు చేసినా అతని సినిమాల ప్రభావం తెలుగులో కూడా ఉంటుంది.

రజినీకాంత్ కూలీ సినిమాలో సూపర్ స్టార్ ఎలివేషన్స్ ఇంకా సీన్స్ అన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేశాడట లోకేష్. మన తెలుగులో చిరంజీవి లాంటి స్టార్స్ కి అలాంటి డైరెక్టర్ తో సినిమా పడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి చిరంజీవితో లోకేష్ సినిమా ఉంటుందా.. లేదా అలాంటి టాలెంట్ ఉన్న తెలుగు డైరెక్టర్ తో చిరు సినిమా చేస్తాడా అన్నది చూడాలి.