Begin typing your search above and press return to search.

నెల్సన్ Vs లోకేష్ .. కూలీ ఎఫెక్ట్.. సోషల్ మీడియాలో సరికొత్త వార్..

కానీ తీరా సినిమా విడుదలయ్యాక లోకేష్ స్క్రీన్ ప్లే అస్సలు బాలేదని, అసలు లోకేష్ కి ఏమైంది? అంటూ చాలామంది కామెంట్లు చేశారు.

By:  Madhu Reddy   |   15 Sept 2025 8:00 PM IST
నెల్సన్ Vs లోకేష్ .. కూలీ ఎఫెక్ట్.. సోషల్ మీడియాలో సరికొత్త వార్..
X

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీ మూవీపై.. సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైన సమయం నుండే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.. ముందు నుండి ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అంటూ అభిమానులు తెగ వైరల్ చేశారు. అయితే ఇది ఎల్ సీ యూ లో భాగం కాదని లోకేష్ నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకున్నా కూడా ఎవరూ ఆయన మాటలు పట్టించుకోలేదు. అలా భారీ అంచనాలతో వచ్చిన 'కూలీ' సినిమా చివరికి బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయింది. అయితే ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణం ఏంటంటే.. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ నాగార్జున విలన్ గా..అలాగే కన్నడ స్టార్ ఉపేంద్ర కీ రోల్ పోషించడం.. అంతేకాకుండా చివర్లో అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నాడని తెలియడంతో ఈ సినిమాపై అటు బాలీవుడ్, ఇటు కన్నడ, తెలుగు, తమిళ ఇలా ప్రతి ఒక్క ఇండస్ట్రీలో అంచనాలు పెరిగిపోయాయి.

కానీ తీరా సినిమా విడుదలయ్యాక లోకేష్ స్క్రీన్ ప్లే అస్సలు బాలేదని, అసలు లోకేష్ కి ఏమైంది? అంటూ చాలామంది కామెంట్లు చేశారు. ముఖ్యంగా రజినీకాంత్ ని చాలా పేలవంగా చూపించారని, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్స్ ని స్క్రీన్ మీద లోకేష్ పేలవంగా చూపించడంతోపాటు వారికి సరైన క్యారెక్టర్లు కూడా ఇవ్వలేదనే టాక్ వినిపించింది. అయితే తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 11 నుండి ఓటీటీలోకి కూలీ మూవీ వచ్చేసింది. ఓటీటిలోకి వచ్చాక కూడా కూలీ మూవీపై నెగటివ్ కామెంట్స్ ఆగడం లేదు. ముఖ్యంగా ఓటీటీ లో సినిమా చూసిన కొంత మంది నెటిజన్లు లోకేష్ కనగరాజ్ vs నెల్సన్ దిలీప్ కుమార్ అంటూ చర్చించుకుంటున్నారు.

ఒక నెటిజన్, లోకేష్ నెల్సన్ ల గురించి ప్రస్తావిస్తూ నెల్సన్ దిలీప్ కుమార్ ఎప్పుడూ కూడా పూర్తి స్క్రిప్ట్ తో షూటింగ్ ను స్టార్ట్ చేస్తారు. కానీ లోకేష్ మాత్రం వివరణాత్మక స్క్రిప్టులను దాట వేయడం వల్ల ఎడిటింగ్లో మిగతా స్క్రిప్టులను చేర్చడంతో అది గందరగోళానికి దారి తీస్తుంది.అంతేకాకుండా నెల్సన్ కేవలం సింగిల్ లైన్ ఆలోచనలను మాత్రమే తీసుకొని వాటిని తనదైన స్టైల్ లో తీస్తారు. కానీ లోకేష్ మాత్రం అనేక మూలాల నుండి సూచనలు తీసుకొని వాటిని కరెక్ట్ గా అమలు చేయడంలో విఫలమవుతున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అక్కడితో ఆగకుండా.. నెల్సన్ ఏ ఇంటర్వ్యూలో అయినా సరే చాలా సరదాగా కనిపించి వినోదాత్మక సినిమాలను అందిస్తాడు. లోకేష్ మాత్రం తెలివైన వాడిగా కనిపించి బలహీనమైన సినిమాలను తీస్తాడు అంటూ షాకింగ్ పోస్టులు పెడుతున్నారు.. నెల్సన్ దిలీప్ కుమార్, లోకేష్ కనగరాజ్ ల మధ్య ఉండే స్పష్టమైన తేడాలు ఇవే అంటూ ఈ పోస్టులను సోషల్ మీడియాలో హైలెట్ చేస్తున్నారు. అలా కూలీ మూవీ ఓటీటీ లోకి వచ్చాక లోకేష్ వర్సెస్ నెల్సన్ అంటూ కొంతమంది పెట్టే ఈ పోస్టులు నేషనల్ వైడ్ గా వైరల్ అవ్వడంతో ఇది కాస్త నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.

అలా భారీ అంచనాలతో వచ్చి కూలీ మూవీతో లోకేష్ కనగరాజ్ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాడు. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా నెల్సన్ దిలీప్ కుమార్ రజినీకాంత్ తో జైలర్ మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు అంటూ మాట్లాడుకుంటున్నారు.