Begin typing your search above and press return to search.

ప్రభాస్ పిలుపు కోసం లోకేష్..?

ఐతే సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ డైరెక్టర్ టాలెంట్ ని అంచనా వేయలేదు. కూలీ తర్వాత ఖైదీ 2 తో వస్తున్నాడు లోకేష్.

By:  Ramesh Boddu   |   19 Aug 2025 11:41 AM IST
ప్రభాస్ పిలుపు కోసం లోకేష్..?
X

కూలీతో లోకేష్ కనకరాజ్ అంచనాలను అందుకోలేదన్న పాయింట్ ఓ పక్క. కానీ కూలీపై ఈ హైప్ వచ్చింది అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు మిగతా స్టార్స్ ఎంత రీజనో.. మరోపక్క ఈ సినిమా లోకేష్ కనకరాజ్ డైరెక్టోరియల్ అనే క్రేజ్ కనబడింది. సినిమా ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అయ్యింది లేదు అన్నది సెకండ్ మ్యాటర్. ఐతే లోకేష్ నుంచి ఖైదీ, విక్రం లాంటి సినిమాలు చూసిన ఆడియన్స్ కు కూలీ ఆ రేంజ్ వర్క్ సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. లోకేష్ ఇంకాస్త టైం తీసుకుని కూలీకి పనిచేస్తే బాగుండేదన్న టాక్ ఉంది.

కూలీ తర్వాత ఖైదీ 2..

ఐతే సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ డైరెక్టర్ టాలెంట్ ని అంచనా వేయలేదు. కూలీ తర్వాత ఖైదీ 2 తో వస్తున్నాడు లోకేష్. ఆ సినిమాతో మరోసారి తన ఎల్.సి.యు రేంజ్ ఏంటన్నది చూపించాలని చూస్తున్నాడు. ఖైదీ 2 కోసం ఆల్రెడీ 34 పేపర్ల స్క్రిప్ట్ సిద్ధమని.. అది వేరే లెవెల్ అని కూలీ ఇంటర్వ్యూలో చెప్పాడు లోకేష్. కచ్చితంగా కార్తి, లోకేష్ ఇద్దరు కలిసి మరో సెన్సేషనల మూవీ చేస్తారని అనిపిస్తుంది.

ఇక లోకేష్ హీరోల లిస్ట్ లో తెలుగు స్టార్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ లోకేష్ తో పనిచేయాలని ఉత్సాహంగా ఉన్నాడట. లోకేష్ కూడా ప్రభాస్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ లోకేష్ ఈ కాంబో సెట్ అయితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ మోత గ్యారెంటీ. తన ప్రతి సినిమాతో హఒప్ ఎక్కించడంలో సక్సెస్ అవుతున్నాడు లోకేష్ కనకరాజ్.

ప్రభాస్ తన కమిట్మెంట్లు అన్నీ పూర్తి చేశాక..

డైరెక్టర్ లోకేష్ అనగానే ఏమో ఇది మరో ఖైదీ, విక్రం అవుతుందేమో అని ఆడియన్స్ అండ్ సినీ లవర్స్ ఎగ్జైట్ అవుతున్నారు. కూలీ సినిమాలో అతని వర్క్ హాఫ్ సాటిఫాక్టరీ అనిపించినా నెక్స్ట్ ఖైదీ 2 మాత్రం జాగ్రత్త పడతాడని తెలుస్తుంది. ఇక ప్రభాస్ తన కమిట్మెంట్లు అన్నీ పూర్తి చేశాక లోకేష్ తో చేసే ఛాన్స్ ఉందట.

మరి ప్రభాస్ తో లోకేష్ సినిమా ఎల్.సి.యు లా తీస్తాడా లేదా స్టాండలోన్ సినిమా అవుతుందా అన్నది చూడాలి. మరి ఈ కాంబో ఎప్పుడు సెట్ అవుతుంది అన్నది చూడాలి. ప్రభాస్ చేతిలో అరడజను సినిమాల దాకా ఉన్నాయి. అవి పూర్తైతే కానీ లోకేష్ సినిమా ఉండే ఛాన్స్ లేదు. లోకేష్ కూడా ఖైదీ 2, విక్రం 2 ఇలా వరుస ఎల్.సి.యు మూవీస్ ప్లానింగ్ లో ఉన్నాడు. సూర్యతో రోలెక్స్ ఫుల్ లెంగ్త్ మూవీ కూడా ఒకటి ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది.