కూలీ పాయింట్.. అక్కడ నుంచి లేపేశారా..?
సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలీ సినిమా చేసిన లోకేష్ ఆ సినిమా సొంత కథతో తీశాడని అనుకున్నారు.
By: Ramesh Boddu | 20 Aug 2025 3:38 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలీ సినిమా చేసిన లోకేష్ ఆ సినిమా సొంత కథతో తీశాడని అనుకున్నారు. కానీ సినీ లవర్స్ మాత్రం ఆ సినిమా మలయాళంలో మమ్ముట్టి చేసిన ఒక సినిమా పాయింట్ ని లోకేష్ తీసుకున్నాడని అంటున్నారు. ఓటీటీలు వచ్చాక ఒక సినిమా పాయింట్ సేం అనిపిస్తే చాలు అది ఎక్కడ నుంచి స్పూర్తిగా తీసుకున్నారో కనిపెట్టేస్తున్నారు. ఆల్రెడీ లోకేష్ కనకరాజ్ లియో సినిమా జగపతి బాబు గాయం 2 సినిమా నుంచి తీశానని చెప్పాడు.
మమ్ముట్టి నటించిన కౌరవర్..
ఐతే కూలీ విషయంలో అలాంటి లీక్స్ ఇవ్వలేదు లోకేష్. కానీ కూలీ సినిమా చూసిన మలయాళ సినీ లవర్స్ ఇది మమ్ముట్టి నటించిన కౌరవర్ తో పోలుస్తున్నారు. కూలీ సినిమాలో పెద్ద ట్విస్ట్ అనుకున్న పాయింట్ సత్యరాజ్ కూతుళ్లలో ఒకరు రజనీ బిడ్డ అని.. ఐతే అది శృతి హాసనే అన్నది సినిమాలో రివీల్ అయ్యే టైం లో ఆడియన్స్ కనిపెట్టేస్తారు. అందుకే ఆ ట్విస్ట్ సరిగా వర్కవుట్ కాలేదు.
సరిగ్గా ఈ పాయింట్ 1992 లో మమ్ముట్టి చేసిన కౌరవర్ లో ఉంటుంది. ఆ సినిమా అక్కడ మంచి సక్సెస్ అందుకుంది. పోలీస్ అయిన విష్ణు వర్ధన్ మీద రివెంజ్ కోసం జైలు నుంచి తిరిగి రాగానే మమ్ముట్టికి ఒక వాస్తవం తెలుస్తుంది. మమ్ముట్టి కూతురు చనిపోలేదు ఆ పోలీస్ పెంచుతున్నాడని తెలిసి షాక్ అవుతాడు. ఐతే అందులో కూడా ఆ ముగ్గురు బిడ్డల్లో ఎవరు తన కూతురు తెలియక ఇబ్బంది పడతాడు. అదే కథతో ఆ సినిమా నడుస్తుంది. ఆ సినిమాను తెలుగులో మోహన్ బాబు, కృష్ణం రాజు ఖైదీగారు గా రీమేక్ చేశారు కానీ ఆడలేదు.
అమితాబ్ బచ్చన్ దీవార్..
కూలీలో కూడా ఈ పాయింట్ ని వాడేశాడు లోకేష్. ఐతే ఆ సినిమాలోలా మమ్ముట్టికి నిజం తెలిసిందన్న విషయం తెలియకుండానే పోలీస్ చనిపోతాడు. కానీ కూలీలో అలా లేదు. ఐతే కూలీ సినిమాలో ఆ పోర్ట్ సెటప్ అంతా కూడా అమితాబ్ బచ్చన్ దీవార్ నుంచి తీసుకున్నట్టు అనిపిస్తుంది. సో కూలీ సినిమాకు లోకేష్ చాలా రిఫరెన్స్ లు తీసుకున్నాడు. ఐతే ఒకటి రెండు కాదు ఇలాంటి రిఫరెన్స్ లు ఎక్కువ అయ్యాయి కాబట్టే సినిమాను తన స్టైల్ లో తెరకెక్కించలేకపోయాడు. లోకేష్ కూలీ తర్వాత ఖైదీ 2 చేస్తాడన్న టాక్ ఉంది. కానీ లేటెస్ట్ గా కమల్, రజనీతో ఒక మల్టీస్టారర్ తో ప్లాన్ చేస్తున్నాడు.
