LCUపై లోకేష్ కనగరాజ్ ఫుల్ క్లారిటీ!
దీని తరువాత ఇదే సినిమాటిక్ యూనివర్స్‌లో లోకీ చేసిన మరో మూవీ `విక్రమ్`. కమల్ నటించిన ఈ సినిమా ఆయనకు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్‌ని అందించి రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది.
By: Tupaki Entertainment Desk | 26 Jan 2026 3:12 PM ISTకోలీవుడ్ టాప్ డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్ ఒకరు. విభిన్నమైన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌లని తెరకెక్కించడంలో తనదైన మార్కుని క్రియేట్ చేసుకోవడమే కాకుండా దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్నాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన మూవీ `ఖైదీ`. హీరోయిన్ క్యారెక్టర్ లేకుండా ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ యాక్షన్ డ్రామా దర్శకుడిగా లోకేష్‌కు, హీరోగా కార్తికి మంచి పేరు తెచ్చి పెట్టింది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొంది బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల మార్కుని సాధించి ఆకట్టుకుంది.
దీని తరువాత ఇదే సినిమాటిక్ యూనివర్స్‌లో లోకీ చేసిన మరో మూవీ `విక్రమ్`. కమల్ నటించిన ఈ సినిమా ఆయనకు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్‌ని అందించి రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. ఇందులో సూర్య నటించిన రోలెక్స్ క్యారెక్టర్ సినిమాపై భారీ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసింది. ఇందులో భాగంగా విజయ్‌తో చేసిన `లియో` పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయినా బాక్సాఫీస్ వద్ద మాత్రం విజయ్ క్రేజ్ కారణంగా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. దీని తరువాత లోకేష్ కనగరాజ్ తన క్రేజ్‌ని కోల్పోవడం, రజనీతో చేసిన `కూలీ` డిజాస్టర్ కావడం తెలిసిందే.
`కూలీ` ఫ్లాప్ నేపథ్యంలో లోకేష్ కనగరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్‌కు ముగింపు పలికేశాడని, `ఖైదీ 2`, విక్రమ్ 2, రోలెన్స్ వంటి సినిమాలు రావడం ఇక కష్టమేనని ప్రచారం మొదలైంది. వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో లోకీ తన సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేసేశాడని, ఈ యూనివర్స్ నుంచి ఇక సీక్వెల్స్ రావడం కల్ల అని కామెంట్‌లు మొదలయ్యాయి. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఓ భారీ యాక్షన్ మూవీకి శ్రీకారంచుట్టిన విషయం తెలిసిందే.
బన్నీ 23వ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ని ఇటీవలే ప్రారంభించారు. దీంతో `ఖైదీ 2`, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఇక ముగిసినట్టేనని, భారీ పారితోషికం డిమాండ్ చేయడం వల్లే `ఖైదీ 2` నుంచి లోకేష్ తప్పుకున్నాడని వార్తలు షికారు చేశాయి. అయితే ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదని, అవన్నీ వట్టి అవాస్తవాలని రీసెంట్‌గా లోకేష్ కనగరాజ్ స్పష్టం చేశాడు. LCUపై వస్తున్న వార్తలన్నీ వదంతులేనని క్లారిటీ ఇచ్చాడు. అల్లు అర్జున్ సార్ సినిమా తరువాత నెక్స్ట్ మూవీ `ఖైది 2`.
ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ ఇవన్నీ నా కమిట్‌మెంట్స్. వాటిని పూర్తి చేయకుండా నేను ఎక్కడికీ వెళ్లను. LCU అతి త్వరలోనే తిరికి పునః ప్రారంభం అవుతుంది. `బెంజ్` మూవీ కూడా LCUలో భాగమే` అని లోకేష్ కనగరాజ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో LCUపై వస్తున్న వార్తలకు చెక్ పడింది. ఇదిలా ఉంటే LCUలో భాగంగా రాఘవలారెన్స్ హీరోగా రూపొందుతున్న మూవీ `బెంజ్`. నవీన్ పాలీ, సంయుక్త మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు. జీ స్క్వాడ్ బ్యానర్‌పై ఈ మూవీని దర్శకుడు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ చేస్తున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
