Begin typing your search above and press return to search.

లోకేష్.. ఇప్పుడు టాలీవుడ్ మల్టీస్టారరా?

లోకేష్ కనగరాజ్.. ఈ పేరు వినగానే ఒకప్పుడు ఏ రకమైన హైప్ ఉండేదో మనందరికీ తెలుసు.

By:  M Prashanth   |   17 Dec 2025 9:25 AM IST
లోకేష్.. ఇప్పుడు టాలీవుడ్ మల్టీస్టారరా?
X

లోకేష్ కనగరాజ్.. ఈ పేరు వినగానే ఒకప్పుడు ఏ రకమైన హైప్ ఉండేదో మనందరికీ తెలుసు. విక్రమ్ సినిమాతో ఊహకందని రేంజ్ కి ఎదిగాడు. అయితే, రీసెంట్ గా వచ్చిన కూలీ సినిమాతో ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. రజినీకాంత్ తో చేసిన కూలీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, ఇప్పుడు లోకేష్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది పెద్ద మిస్టరీగా మారింది. అసలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) ఏమైంది, ఖైదీ 2 ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నలకు సమాధానం లేక ఫ్యాన్స్ కూడా అయోమయంలో ఉన్నారు.

కార్తీ కూడా రీసెంట్ గా ఖైదీ 2 విషయం లోకేష్ కే తెలియాలి అంటూ ఒక హింట్ ఇచ్చి వదిలేశారు. ఈ కన్ఫ్యూజన్ మధ్యలో ఇప్పుడు టాలీవుడ్ లో ఒక క్రేజీ రూమర్ మొదలైంది. లోకేష్ కనగరాజ్ చూపు ఇప్పుడు తెలుగు స్టార్స్ మీద పడిందనే టాక్ వైరల్ అవుతోంది. అది కూడా సింగిల్ హీరోతో కాదు, ఏకంగా ఇద్దరు బడా స్టార్లతో ఒక భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారట. ఆ హీరోలు ఎవరో కాదు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్.

వినిపిస్తున్న బజ్ ప్రకారం, లోకేష్ ఇప్పటికే అల్లు అర్జున్ కు ఒక లైన్ వినిపించారట. ఆ స్టోరీ బన్నీకి బాగా నచ్చిందని, చేయడానికి కూడా ఆసక్తిగా ఉన్నారని టాక్. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ కథలో మరో హీరో పాత్ర కూడా అంతే బలంగా ఉంటుందట. ఆ పాత్ర కోసం లోకేష్ ఎన్టీఆర్ ను విజన్ లో పెట్టుకున్నారట. ఒకవేళ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, తాను వెంటనే సినిమా చేయడానికి సిద్ధమని బన్నీ చెప్పినట్లు సమాచారం.

నిజానికి లోకేష్ లైనప్ విషయంలో చాలా రకాల కన్ఫ్యూజన్ ఇచ్చే న్యూస్ లు వస్తున్నాయి. అమీర్ ఖాన్ తో ఒక సినిమా ఉంటుందని ఆ మధ్య స్వయంగా అమీర్ క్లారిటీ ఇచ్చారు. మధ్యలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ పేర్లు కూడా వినిపించాయి. ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు సడన్ గా ఈ ఎన్టీఆర్ బన్నీ మల్టీస్టారర్ తెరమీదకు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే పట్టాలెక్కుతుందా లేక ఫ్యూచర్ ప్లానా అనేది క్లారిటీ లేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. బన్నీ కూడా అట్లీ తో హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తున్నాడు. అసలు ఈ క్రేజీ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవుతుందా అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఒకవేళ ఇది సెట్ అయితే మాత్రం అది ఇండియన్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అవుతుందనడంలో సందేహం లేదు.