అల్లు అర్జున్ సినిమాపై లోకేష్ క్లారిటీ.. ఫ్యాన్స్ ఊహించని ట్విస్ట్!
లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) గురించి ఆడియన్స్ లో ఎప్పుడూ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది.
By: Sravani Lakshmi Srungarapu | 10 July 2026 4:10 PM ISTలోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) గురించి ఆడియన్స్ లో ఎప్పుడూ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఖైదీతో ప్రారంభమైన ఈ యూనివర్స్ విక్రమ్, లియో వంటి సినిమాలతో మరింత విస్తరించగా, తర్వాత ఏ సినిమా LCUలో భాగం అవుతుందనే డిస్కషన్ తరచూ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో లోకేష్ చేయబోయే భారీ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి అది కూడా LCUలో భాగమేనన్న ఊహాగానాలు బలంగా వినిపించాయి. అయితే తాజాగా ఈ అంశంపై లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
లోకేష్ నెక్ట్స్ ప్రియారిటీ అల్లు అర్జున్‌తో తెరకెక్కించనున్న సినిమానేనని, ఆ సినిమా పూర్తిగా కొత్త కథతో రూపొందుతుందని, LCUతో ఎలాంటి సంబంధం ఉండదని అంటున్నారు. దీంతో గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలన్నీ రూమర్లేనని అర్థమవుతుంది. బన్నీ కోసం స్పెషల్ గా రూపొందించిన ఈ కథను ఇండిపెండెంట్ సినిమాగా లోకేషన్ తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తన రాకా సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే లోకేష్ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప సిరీస్ తర్వాత బన్నీ చేస్తున్న మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.
ఇక LCU ఫ్యూచర్ పై లోకేష్ మాట్లాడి కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ సినిమా పూర్తి చేసిన తర్వాత తిరిగి తన సినిమాటిక్ యూనివర్స్‌పై దృష్టి సారిస్తానని ఆయన వెల్లడించారు. అంటే LCU కథలు ఆగిపోలేదని, కేవలం టెంపరరీ బ్రేక్ మాత్రమే తీసుకుంటున్నట్టు ఆయన కామెంట్స్ తో క్లారిటీ వచ్చింది. దీంతో ఖైదీ 2, విక్రమ్‌కు సంబంధించిన తదుపరి పరిణామాలపై కూడా అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
మరోవైపు రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న బెంజ్ సినిమా మాత్రం అధికారికంగా LCUలో భాగమేనని లోకేష్ మరోసారి ధృవీకరించారు. దీంతో ఆ సినిమా ద్వారా యూనివర్స్ మరింత విస్తరించనున్నట్లు స్పష్టమైంది. ఇప్పటికే ఖైదీ, విక్రమ్, లియో సినిమాల్లో కనిపించిన అనుసంధానాల మాదిరిగానే బెంజ్ లో కూడా పలు ఇంట్రెస్టింగ్ లింక్స్ ఉండే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తంగా చూస్తే, అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమా LCUలో భాగం కాదనే క్లారిటీ అభిమానులకు ఒక కొత్త అప్డేట్ గా మారింది. ఒకవైపు పూర్తిగా ఫ్రెష్ కథతో బన్నీ- లోకేష్ కాంబినేషన్‌ను ఆస్వాదించే అవకాశం లభించనుండగా, మరోవైపు ఆ తర్వాత LCUలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు లోకేష్ సిద్ధమవుతున్నారని ఆయన కామెంట్స్ స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఈ రెండు ప్రాజెక్ట్‌లపైనా సినీ అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి.
