Begin typing your search above and press return to search.

L.C.Uకి ఊపిరి పోసే ప్రాజెక్ట్ ఏది..?

లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ కోలీవుడ్ లో ఒక పెద్ద సంచలనాన్నే సృష్టించాడు డైరెక్టర్ లోకేష్.

By:  Ramesh Boddu   |   11 Dec 2025 3:00 PM IST
L.C.Uకి ఊపిరి పోసే ప్రాజెక్ట్ ఏది..?
X

లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ కోలీవుడ్ లో ఒక పెద్ద సంచలనాన్నే సృష్టించాడు డైరెక్టర్ లోకేష్. ఖైదీ తీసే టైం లో దాన్ని సినిమాటిక్ యూనివర్స్ చేయాలన్న ఆలోచన ఉందో లేదో కానీ విక్రం సినిమాలో ఢిల్లీ, రోలెక్స్ లను యాడ్ చేసి లోకేష్ చేసిన మ్యాజిక్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఐతే ఆ తర్వాత లోకేష్ నుంచి వస్తున్న ఏ సినిమా అయినా సరే ఎల్.సి.యు లో భాగమే అని అంచనా వేయడం మొదలు పెట్టారు. ముఖ్యంగా లోకేష్ రీసెంట్ మూవీ కూలీ సినిమాను అలా L.C.U అని ఊదరగొట్టి చివర్లో అది కాకపోయే సరికి ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యారు.

కూలీ తర్వాత వెంటనే అమీర్ ఖాన్ సినిమా..

కూలీ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవడం అన్నది పక్కన పెడితే అది చేసిన డ్యామేజ్ వల్ల లోకేష్ కి వచ్చిన ఛాన్స్ లు కూడా వెనక్కి వెళ్లేలా చేసింది. అసలైతే కూలీ తర్వాత వెంటనే అమీర్ ఖాన్ సినిమా చేయాల్సి ఉండగా అది ఎందుకో పోస్ట్ పోన్ అయ్యింది. ఇక ఖైదీ 2 వస్తుందని అనుకోగా దానికి కూడా కొంత టైం పడుతుందని తెలుస్తుంది. ఎల్.సి.యు, ఎల్.సి.యు అంటూ హడావిడి చేసిన లోకేష్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు.

ఐతే నెక్స్ట్ లోకేష్ అర్జెంట్ గా ఒక హిట్ కొట్టాలి. అప్పుడే అతని మీద మళ్లీ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఖైదీ 2 కాస్త టైం పట్టేలా ఉందని తెలుస్తుండగా అమీర్ సినిమానే లైన్ లో తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడట లోకేష్. ఐతే ఈ సినిమాను స్టాండలోన్ గా చేస్తాడా లేదా మళ్లీ L.C. U అని ఆర్భాటం చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. L.C.Uకి ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. పకడ్బందీ స్టోరీతో ప్లాన్ చేస్తే మాత్రం ఖైదీ 2, రోలెక్స్, విక్రం 2 ఇలా L.C.U సినిమాలకు తిరుగు ఉండదు.

లోకేష్ లిస్ట్ లో మన తెలుగు స్టార్స్..

కానీ అంతకన్నా ముందు లోకేష్ హిట్ ట్రాక్ ఎక్కాలి. విక్రం తర్వాత తన రేంజ్ హిట్ అందుకోలేని లోకేష్ కూలీతో గ్రాఫ్ పడిపోయేలా చేసుకున్నాడు. అందుకే ఈసారి ఎలాంటి సినిమా తీసినా తన టార్గెట్ సూపర్ హిట్టే పెట్టుకున్నాడు. ఐతే డైరెక్షన్ కి గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం యాక్టర్ గా తను సోలో లీడ్ గా ఒక సినిమా చేస్తున్నాడు లోకేష్. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేశాక తన నెక్స్ట్ డైరెక్టోరియల్ సినిమా చేస్తాడని చెప్పొచ్చు.

లోకేష్ హీరోల లిస్ట్ లో మన తెలుగు స్టార్స్ కూడా ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో లోకేష్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే మాత్రం ఎల్.సి.యు కి లింక్ చేస్తూ లోకేష్ అల్లు అర్జున్ సినిమా ఒకటి వచ్చే అవకాశం లేకపోలేదు. ఐతే నెక్స్ట్ ఎవరితో చేసినా సరే లోకేష్ పక్కా హిట్ కొట్టే ప్రణాళికతోనే వస్తాడని అంటున్నారు.