Begin typing your search above and press return to search.

లోకేష్ క‌న‌గ‌రాజ్ ఆ విష‌యంలో ఫెయిల్‌?

కోలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్స్ ఈ మ‌ధ్య మెగా ఫోన్ ప‌ట్టి స్టార్ కెమెరా..యాక్ష‌న్‌.. చెప్ప‌డం కంటే కెమెరా ముందు యాక్ష‌న్ చేయ‌డానికే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్నారు

By:  Tupaki Entertainment Desk   |   14 Feb 2026 6:25 PM IST
లోకేష్ క‌న‌గ‌రాజ్ ఆ విష‌యంలో ఫెయిల్‌?
X

కోలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్స్ ఈ మ‌ధ్య మెగా ఫోన్ ప‌ట్టి స్టార్ కెమెరా..యాక్ష‌న్‌.. చెప్ప‌డం కంటే కెమెరా ముందు యాక్ష‌న్ చేయ‌డానికే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్నారు. ఈ విష‌యంలో ఇప్ప‌టికే కొంత మంది యంగ్ డైరెక్ట‌ర్స్ హీరోలుగా ఒప్పించారు కూడా. సూప‌ర‌ఖ హిట్‌లు, బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని త‌మ ఖాతాలో వేసుకుంటూ మ‌రిన్ని క్రేజీ సినిమాల‌కు రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఇదే బాట‌లో క్రేజీ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ కూడా చేరుతున్నాడు. ఆయ‌న హీరోగా ప‌రిచ‌యం అవుతున్న మూవీ `డీసీ (దేవ‌దాస్‌- చంద్ర‌)`.

అరుణ్ మాథేశ్వ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై క‌ళానిధి మార‌న్ నిర్మిస్తున్న ఈ మూవీలో లోకేష్ క‌న‌గ‌రాజ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ వామికా గ‌బ్బి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, గ్లింప్స్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి. వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా మేక‌ర్స్ `బ్ల‌డీ వాలెంటైన్‌` పేరుతో ఒక స్పెష‌ల్ గ్లింప్స్‌ని విడుద‌ల చేశారు. లోకేష్ క‌న‌గ‌రాజ్ సినిమాల్లో ఉండే వ‌యోలెన్స్ ఇందులోనూ ప‌తాక స్థాయిలో క‌నిపిస్తోంది. స్టేజ్ డ్రామా ఆర్టిస్ట్‌కు, ఓ రూత్‌లెస్ రౌడీకి మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ‌గా దీన్ని తెర‌కెక్కించిన‌ట్టుగా తెలుస్తోంది.

త‌న సినిమాకు మించి క్రూర‌మైన క్యారెక్ట‌ర్‌లో లోకేష్ క‌న‌గ‌రాజ్ న‌టిస్తున్న‌ట్టుగా గ్లింప్స్‌లోని స‌న్నివేశాలని చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఇందులోని స‌న్నివేశాల్లో లోకేష్ క‌త్తి ప‌ట్టుకుని సిగ‌రేట్ కాలుస్తూ అడ్డువ‌చ్చి వారి పీక‌లు కోస్తూ వెళుతుండ‌టం ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉంది. గ్లింప్స్ ఎండ్‌లో లోకేష్‌, వామిక గ‌బ్ఇ గ‌న్స్ ప‌ట్టుకుని కాల్పులు జ‌రుపుతూ క‌నిపించారు. ఇద్ద‌రు ప్రేమికుల క్రూర‌మైన స్టోరీగా ఇది క‌నిపిస్తోంది. ఇందులోని మ‌రో కీల‌క పాత్ర‌లో యంగ్ బ్యూటీ సంజ‌నా కృష్ణ‌యూర్తి న‌టించింది. ఇందులో త‌న‌ది ఓ వేశ్య క్యారెక్ట‌ర్‌.

త్యాగం చేసే యువ‌తిగా త‌న క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని తెలుస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లోకేష్ క‌న‌గ‌రాజ్ సినిమాల‌కు మించిన హింస‌తో రూపొందిన‌ట్టుగా అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ మూవీని స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని స‌న్‌పిక్చ‌ర్స్ వ‌ర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. `బ్ల‌డీ వాలెంటైన్‌` పేరుతో విడుద‌లైన గ్లింప్స్ విజువ‌ల్స్ ప‌రంగా బాగుంది. స‌న్‌పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ స్థాయి త‌గ్గ క్వాలిటీతో, టెక్నిక‌ల్ వ్యాల్యూస్‌తో ఉంది.

అయితే లోకేష్ క‌న‌గ‌రాజ్ మాత్రం న‌టుడిగా ఇందులో తేలిపోయాడ‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. త‌ను రూపొందించిన సినిమాల్లోని పాత్ర‌ల్లో ఇంటెన్సీటీ ఉంటుంది. హీరో, విల‌న్ క్యారెక్ట‌ర్స్ చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటాయి. న‌ట‌న, వారి హావ‌భావాలు స‌హ‌జంగా ఉంటాయి. అయితే డైరెక్ట‌ర్‌గా త‌న సినిమాల్లోని న‌టీన‌టుల నుంచి ఇంటెన్స్ ఉన్న యాక్టింగ్ ని రాబ‌ట్టిన లోకేష్ క‌న‌గ‌రాజ్ న‌టుడిగా మాత్రం ఆ మ్యాజిక్‌ని చేయ‌లేక‌పోయాడు. ఈ విష‌యంలో లోకేష్ విఫ‌ల‌మ‌య్యాడు అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.