Begin typing your search above and press return to search.

సెంచ‌రీ కొట్టిన యువ స్టార్ అక్క‌డితో ఆగుతాడా?

మరి ఈ విజయంతో లోకేష్ నటన ఇక్కడితో ఆపేస్తారా? లేక పూర్తి స్థాయి నటుడిగా ప్రయాణాన్ని కొనసాగిస్తారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

By:  Srikanth Kontham   |   27 Aug 2026 2:00 PM IST
సెంచ‌రీ కొట్టిన యువ స్టార్ అక్క‌డితో ఆగుతాడా?
X

కోలీవుడ్ లో సరికొత్త మాస్ కల్ట్ సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తాజాగా నటుడిగానూ అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగ‌తి తెలిసిందే. లోకేష్ హీరోగా న‌టించిన డీసీ ఇటీవ‌లే రిలీజ్ అయి మంచి విజ‌యాన్ని అందుకుంది. ఆ విజ‌యం ఏకంగా అత‌డిని వంద కోట్ల క్ల‌బ్ లో కూర్చో బెట్టింది. ఈ రేంజ్ విజ‌యం సాధిస్తుంద‌ని లోకేష్ కూడా ఊహించ‌లేదు. మరి ఈ విజయంతో లోకేష్ నటన ఇక్కడితో ఆపేస్తారా? లేక పూర్తి స్థాయి నటుడిగా ప్రయాణాన్ని కొనసాగిస్తారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

దర్శకత్వం అనేది ఎంతటి సృజనాత్మకతతో కూడుకున్నదో? అంతకంటే రెట్టింపు ఒత్తిడితో కూడుకున్న ప్రయాణం. ప్రతి ఫ్రేమ్‌ను మలచడానికి, నటీనటుల నుంచి పర్ఫెక్ట్ అవుట్‌పుట్ రాబట్టడానికి దర్శకుడు పడే శ్రమ సాధారణమైనది కాదు. దీనితో పోలిస్తే నటన కాస్త సులువనిపించినా? పూర్తి స్థాయి కెరీర్‌గా ఎంచుకోవడం కష్టతరమైన విషయమే. లోకేష్ కనగరాజ్ విషయానికి వస్తే ఆయనకు తనదైన స్టైల్ మేకింగ్ పై పూర్తి పట్టు ఉంది. అయితే మొదటి చిత్రంతోనే నటుడిగా భారీ కమర్షియల్ సక్సెస్ అందుకోవడం ఆయనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.

అయితే లోకేష్ కనగరాజ్ ముందు కొన్ని బాధ్య‌త‌లు ఉన్నాయి. పలువురు స్టార్ హీరోలతో భారీ ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి. దర్శకుడిగా ఆయన పూర్తి చేయాల్సిన కమిట్‌మెంట్లు, సినిమా యూనివర్స్ ప్లాన్స్ చాలానే ఉన్నాయి. ఒకవైపు అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరోవైపు నటుడిగా ప్రయోగాలు చేయడం అంత తేలికైన విషయం కాదు. అప్పుడప్పుడు అతిథి పాత్రలు లేదా ప్రత్యేకమైన రోల్స్ చేయడం వేరు. ఫుల్ టైమ్ హీరోగా సినిమాలు చేయడం వేరు. దర్శకుడిగా లోకేష్ పై ఉన్న అపారమైన బాధ్యతల రీత్యా, నటనను సైడ్ హ్యాండ్‌గా మాత్రమే ఉంచుతారనే? వాదన ఎక్కువగా వినిపిస్తోంది.

మరోకోణంలో చూస్తే టాలీవుడ్‌లో.. కోలీవుడ్‌లో దర్శకులు హీరోలుగా మారిన సందర్భాలు కోకొల్లలు. కానీ లోకేష్ లాంటి క్రేజీ డైరెక్టర్ హీరోగా తొలి చిత్రంతోనే వంద కోట్ల మార్క్‌ను టచ్ చేయడం ట్రెండ్‌ను మార్చేలా ఉంది. ప్రేక్షకులు కూడా ఆయ‌న్ని ఓ కొత్త కోణంలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయినా? సినిమాల మీద ఆయనకున్న ప్యాషన్, నెక్స్ట్ లెవెల్ డైరెక్షన్ ప్లాన్స్ చూస్తుంటే ఆయ‌న‌ పూర్తి స్థాయి నటుడిగా మారుతారని చెప్పడం తొందరపాటే అవుతుంది.

మొత్తానికి డీసీతో నటుడిగా అదిరిపోయే అరంగేట్రం చేసిన లోకేష్ కనగరాజ్.. దర్శకుడిగా ప్రయాణాన్ని ఆపే ప్రసక్తే లేదని చెప్పొచ్చు. భవిష్యత్తులోనూ ఆయన నుంచి మరిన్ని భారీ చిత్రాలు రావడం ఖాయం. అదే సమయంలో, నచ్చిన ప్రత్యేక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరించే అవకాశాలను కూడా ఆయన పూర్తిగా వదులు కోకపోవచ్చు. ఈ రెండు రంగాలను లోకేష్ ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారనేది చూడాలి.