Begin typing your search above and press return to search.

కార్తి లాంటి టైర్ 2 హీరోతో అవసరమా.. లోకేష్ సమాధానమిదే

లోకేష్ కనగరాజ్ యూనివర్స్ అనే ఓ సిరీస్ ను క్రియేట్ చేసి ఆయన వరుసగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు.

By:  M Prashanth   |   6 Aug 2025 7:45 PM IST
కార్తి లాంటి టైర్ 2 హీరోతో అవసరమా.. లోకేష్ సమాధానమిదే
X

డైరెక్టర్ లోకెష్ కనగరాజ్ తమిళ్ లో సెన్సెషనల్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. లోకేష్ కనగరాజ్ యూనివర్స్ అనే ఓ సిరీస్ ను క్రియేట్ చేసి ఆయన వరుసగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు అందులో భాగంగా వచ్చినవే. అయితే ఆయన తాజాగా తెరకెక్కించిన కూలీ మాత్రం ఎల్ సీయూలో భాగం కాదని ఇప్పటికే చెప్పారు.

రజనీకాంత్ హీరోగా లోకేష్ తెరకెక్కించిన కూలీ ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ ప్రమోషన్స్ లో బీజీగా ఉంది. అందులో భాగంగా దర్శకుడు లోకేశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో తన తదుపరి చిత్రం ఖైది 2 గురించి లోకేష్ కు ఓ ప్రశ్న అఢిగారు. ఆయన ఇప్పటివరకు కమల్ హాసన్, విజయ్, రజనీకాంత్ లాంచి బడా హీరోలతో పనిచేసిన తర్వాత కార్తీ లాంటి టైర్ 2 హీరోతో సినిమా చేయడంతో తన స్టార్ వ్యాల్యూ తగ్గిపోతుందా అని అడిగారు.

దీనికి లోకేశ్ సమాధానమిచ్చారు. నేను ఎవరో ఈ ప్రపంచానికి తెలియనప్పుడు కార్తి సార్ నాకు, నా టాలెంట్ చూపించుకోడానికి అవకాశం ఇచ్చారు. అందుకే నా దృష్టిలో ఆయన పెద్ద స్టార్ హీరోనే. నాపై ఆయనకున్న నమ్మకమే నన్ను ఈ రోజు నేను ఉన్న స్థితిలో నిలబెట్టింది. ఖైదీ 2 తో నేను ఆయనకు భారీ హిట్ ఇస్తానని బలమైన నమ్మకంతో ఉన్నాను.

లోకేష్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ఖైదీ. 2019లో విడుదలైన ఈ సినిమా భారీ విజయం దక్కించుకుంది. ఈ స్టోరీతో ఇండస్ట్రీ అంతా తన వైపునకు తిప్పుకున్నాడు లోకేష్. ఈ సినిమాలో కార్తి ఖైదీగా కనిపిస్తారు. మాదకద్రవ్యాల సిండికేట్లతో జరిగిన వివాదంలో తన కూతుర్లను కలుసుకునే పాత్రలో కనిపిస్తారు.

ఈ సినిమా సక్సెస్ తోనే లోకేష్ యూనివర్స్ కు పునాది పడింది. అయితే ఖైదీ 2 విషయంలో లోకేష్ కు కార్తిపై ఉన్న గౌరవం కనిపిస్తుంది. ఆయనకు లైఫ్ ఇచ్చిన హీరోను ఎంత గౌరవిస్తున్నాడో తెలుస్తోంది. కార్తి పట్ల లోకేష్ లాయలిటీకి ఫ్యాన్స్ సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఆయన తాజా చిత్రం కూలీ ప్రమోషన్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మీడియాతో చురుగ్గా పాల్గొంటున్నారు. రజనీకాంత్ తోపాటు ఇందులో అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్ వంటి భారీ తారాగణం ఉంది. భారీ అంచనాలతో రానున్నఈ సినిమా ఏ మేర ఫలితం అందుకుంటుందో చూడాలి మరి.