అమీర్ ఖాన్ తో లోకేష్ మూవీ.. మరో క్లారిటీ వచ్చిందిగా!
"సూపర్ హీరో ప్రాజెక్ట్ అని విన్నాం.. ఇరుంబి కాయ్ మాయావి సినిమాను అమీర్ తో చేస్తున్నారా" అని అడిగారు.
By: M Prashanth | 8 Aug 2025 1:59 AM ISTబాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. వారి కాంబినేషన్ లో మూవీ రానుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. వాటిపై రీసెంట్ గా లోకేష్ ఓ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చారు. అమీర్ తో సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆ సినిమా ఇండియన్ మూవీ లవర్స్ ను మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను అలరించనుందని చెప్పారు. బిగ్గెస్ట్ యాక్షన్ ప్రాజెక్ట్ గా మూవీ ఉండనుందని క్లారిటీ ఇచ్చారు. ప్రాజెక్ట్ ఒక సూపర్ హీరో సినిమాగా రాబోతుందని వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు. వచ్చే ఏడాది చివరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలిపారు.
ఇప్పుడు మరోసారి అమీర్ ఖాన్ తో మూవీ విషయంపై మాట్లాడారు. తన అప్ కమింగ్ మూవీ కూలీ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ సమయంలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. అప్పుడు అమీర్ ఖాన్ మూవీ గురించి హోస్ట్ ప్రస్తావించారు.
"సూపర్ హీరో ప్రాజెక్ట్ అని విన్నాం.. ఇరుంబి కాయ్ మాయావి సినిమాను అమీర్ తో చేస్తున్నారా" అని అడిగారు. దీంతో ఆ విషయంపై ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నట్లు లోకేష్ తెలిపారు. ఇరుంబి కాయ్ మాయావి స్టోరీ సుమారు పదేళ్ల క్రితం రాసుకున్నట్లు తెలిపారు. అప్పుడు బడ్జెట్ సహా వివిధ అంశాలపై కాన్ఫిడెన్స్ లేదని చెప్పారు.
అందుకే ఆ తర్వాత వివిధ సినిమాలు చేసినట్లు వెల్లడించారు. కానీ అది నా ఫేవరెట్ స్క్రిప్ట్ అని చెప్పారు. అయితే కొన్ని సినిమాల పేర్లు చెప్పడం లేదు గానీ.. తను అనుకున్న సీన్స్ ఆయా చిత్రాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఇది కంప్లైంట్ గా చెప్పడం లేదని, ఎవరు ఇమాజినేషన్ వాళ్ళది అని అన్నారు. అది మైథిలాజికల్ బేస్డ్ స్క్రిప్ట్ అని చెప్పారు.
అది చాలా ఏళ్ల క్రితం రాసుకున్న స్క్రిప్ట్ అని.. చాలా మార్పులు చేయాల్సి ఉందని అన్నారు. అదే సమయంలో తన డైరెక్షన్ అంటే అమీర్ ఖాన్ కు చాలా ఇష్టమని చెప్పారు. తాము చాలా మాట్లాడుకున్నామని తెలిపారు. కూలీ షెడ్యూల్ పూర్తి అయ్యాక కలిసి మూవీ చేస్తామని ఫిక్స్ అయ్యామని తెలిపారు. అయితే కూలీలో అమీర్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
