Begin typing your search above and press return to search.

చెన్నైలో 10 AK-47లు సీజ్.. AA23పై పెరిగిన సస్పెన్స్

అయితే, ఈ సంఘటన లోకేష్ క‌న‌గ‌రాజ్ కొత్త సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందా? అనే ఆసక్తికరమైన ప్రశ్నను ముందుకు తీసుకొచ్చింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   24 March 2026 11:32 AM IST
చెన్నైలో 10 AK-47లు సీజ్.. AA23పై పెరిగిన సస్పెన్స్
X

చెన్నైలో జరిగిన ఒక అనూహ్య ఘటనతో డైరెక్ట‌ర్ లోకేష‌న్ క‌న‌గ‌రాజ్ మ‌రోసారి డిస్క‌ష‌న్ టాపిక్ గా మారారు. నార్మ‌ల్ గా ఓ పోలీసు చేసిన తనిఖీ, తక్షణమే సంచలనంగా మారి, తర్వాత ఆసక్తికరమైన మలుపు తీసుకోవడం సినీ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఇదే సమయంలో, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై కొత్త అనుమానాలు కూడా తెరపైకి వచ్చాయి. చెన్నై ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహించిన రొటీన్ చెక్‌లో10 AK-47 రైఫిళ్లు సీజ్ చేయడం మొదట పెద్ద షాక్‌ను కలిగించింది. దీంతో ఈ ఆయుధాలు నిజమైనవేనా? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే సందేహాలు మొద‌ల‌య్యాయి.

డ‌మ్మీ ప్రాప‌ర్టీస్ గా గుర్తించిన పోలీసులు

వెంట‌నే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయి, వివిధ రకాల ఊహాగానాలకు దారి తీసింది. అయితే, కొన్ని గంటల్లోనే కథలో ట్విస్ట్ బయటపడింది. అధికారులు చేసిన ఇన్వెస్టిగేష‌న్ లో అవి నిజమైన ఆయుధాలు కావ‌ని, సినిమా షూటింగ్ కోసం వాడే డమ్మీ గన్స్ అని తేలింది. ఈ ప్రాప‌ర్టీస్ లోకేష్ క‌న‌గ‌రాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సంబంధించినవిగా గుర్తించారు. త‌ర్వాత చిత్ర టీమ్ వాటికి సంబంధించిన‌ డాక్యుమెంట్లు, ప‌ర్మిష‌న్స్ ను చూపించ‌గా, చెక్ చేసిన త‌ర్వాత పోలీసులు వాటిని తిరిగి ప్రొడ‌క్ష‌న్ టీమ్ కు అప్పగించారు. దీంతో మొదట భారీ వివాదంగా కనిపించిన విషయం, కేవలం అపార్థంగా ముగిసింది.

షూటింగ్ మొద‌లైందా అని అనుమానాలు

అయితే, ఈ సంఘటన లోకేష్ క‌న‌గ‌రాజ్ కొత్త సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందా? అనే ఆసక్తికరమైన ప్రశ్నను ముందుకు తీసుకొచ్చింది. లోకేష్ త‌న నెక్ట్స్ మూవీని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. AA23 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్టును పిలుస్తున్నారు. సైలెంట్‌గా ఈ మూవీ షూటింగ్ ను లోకేష‌న్ స్టార్ట్ చేశారా అనే అనుమానం ఇప్పుడు అభిమానుల్లో వ్య‌క్త‌మ‌వుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు మూవీ షూటింగ్ గురించి ఎక్క‌డా అఫీషీయల్ అనౌన్స్‌మెంట్ లేక‌పోయినా, ఈ ఘటన కారణంగా ఆ ప్రాజెక్ట్‌పై చర్చలు మళ్లీ వేడెక్కాయి.

కూలీ త‌ర్వాత లోకేష్ పై పెరిగిన ఒత్తిడి

ఇక ఈ సంఘటన సినిమా నిర్మాణంలోని వాస్తవాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. యాక్షన్ సన్నివేశాల కోసం డమ్మీ గన్స్, రియలిస్టిక్ ప్రాప్స్ వాడటం సాధారణమే. వీటిని తరలించేటప్పుడు ప్రత్యేక అనుమతులు, సేఫ్టీ నిబంధనలు తప్పనిసరి. కానీ సమాచార లోపం కానీ, కమ్యూనికేషన్ గ్యాప్ కానీ ఉంటే ఇలాంటి అపార్థాలు తలెత్తే అవకాశముందని ఈ ఘటన స్పష్టం చేసింది. సినిమా వెనుక జరిగే లాజిస్టిక్స్, ప్లానింగ్ ఎంత క్లిష్టంగా ఉంటాయో ఇది గుర్తు చేస్తుంది. మరోవైపు, కూలీ తర్వాత లోకేష‌న్ క‌న‌గ‌రాజ్ పై ప్రెజ‌ర్ కూడా ఎక్కువ‌గా ఉంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫ‌లితాన్ని అందుకోలేద‌నే అభిప్రాయాలుండటంతో, లోకేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో AA23 ఆయనకు కీలకమైన కమ్‌బ్యాక్‌గా మారే అవకాశముంది. మొత్తానికి ఒక సాధారణ తనిఖీగా ప్రారంభమైన ఈ సంఘటన, లోకేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై మ‌రింత ఆసక్తిని పెంచింది.