Begin typing your search above and press return to search.

అది ఎందుకు క్లిక్ అయ్యింది.. ఇది ఎందుకు పోయింది..?

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సక్సెస్ అవుతాయి. మరికొన్ని సినిమాలు భారీ అంచనాలతో వచ్చినా కూడా ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేస్తాయి.

By:  Ramesh Boddu   |   8 Sept 2025 11:19 AM IST
అది ఎందుకు క్లిక్ అయ్యింది.. ఇది ఎందుకు పోయింది..?
X

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సక్సెస్ అవుతాయి. మరికొన్ని సినిమాలు భారీ అంచనాలతో వచ్చినా కూడా ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేస్తాయి. ఇక వారం గ్యాప్ తో ఇలాంటి సినిమాలు వస్తే అందులో ఒకటి సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంటే.. మరో సినిమా బాక్సాఫీస్ దగ్గర చతికిల పడితే ఎలా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఒక పరిస్థితే వచ్చింది. ప్రస్తుతం సినిమాలన్నీ భాషతో సంబంధం లేకుండా మంచి సినిమా ఏ భాషలో వచ్చినా ఆదరిస్తున్నారు.

ఫస్ట్ ఇండియన్ సూపర్ ఉమెన్..

ఈ క్రమంలో రీసెంట్ గా మలయాళం నుంచి వచ్చిన లోక సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. డామెరిక్ అరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించింది. ప్రేమలు హీరో నెస్లేన్ ఈ సినిమాలో మేల్ లీడ్ గా చేశాడు. దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను నిర్మించారు. మలయాళంలోనే కాదు తెలుగు, తమిళ్ లో కూడా లోక సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఐతే ఈ లోక సినిమా ఫస్ట్ ఇండియన్ సూపర్ ఉమెన్ కథతో వచ్చింది. మామూలుగా ఇలాంటి కథలను మనం హాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం. మార్వెల్ స్టూడియోస్ లో ఈ సినిమాలు ఎంకరేజ్ చేస్తాం. కానీ ఇండియన్ సినిమాల్లో సూపర్ ఉమెన్ స్టోరీ రావడం ఇదే మొదటిసారి. అందుకే ఆడియన్స్ ఈ సినిమాను అంతగా ఆదరిస్తున్నారు. ఆగష్టు 29న రిలీజైన ఈ సినిమా అన్నిచోట్ల సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. రిలీజై రెండో వారం లో అడుగు పెట్టినా కూడా లోక ఇంప్రెస్ చేస్తుంది.

క్రిష్ అనుష్క ఈ కాంబో ఘాటి..

ఇక ఇదే టైం లో సెప్టెంబర్ 5న రిలీజైన అనుష్క ఘాటి మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. క్రిష్ అనుష్క ఈ కాంబో పై అంచనాలు బాగున్నాయి. ఘాటిల కథతో క్రిష్ ఏదో అద్భుతం చేస్తాడని అనుకున్నారు. తీరా చూస్తే సినిమాలో ఆయన ఎంచుకున్న ఆ కాన్సెప్ట్ తప్ప ఎక్కడ ఆడియన్స్ ని ఎమోషనల్ కనెక్షన్ చేయలేదు. అందుకే సినిమా చూసి ప్రేక్షకులు పెదవి విరిచారు. ఘాటి సినిమాలో అనుష్క వరకు బాగానే చేసింది.

ఐతే లోక లో జరిగిన మ్యాజిక్ ఘాటి లో జరగలేదు. అదేంటి అది వేరే కథ ఇది వేరే కథ కదా అంటే. కథ, జోనర్ వేరైనా ఏదైనా సినిమా అది ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేసినప్పుడు మేజర్ గా ఆడియన్స్ ని కన్విన్స్ చేయడంలోనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. అఫ్కోర్స్ స్టార్ సినిమా అయినా అంతే కానీ స్టార్ సినిమాల్లో కొన్ని ఫ్యాక్టర్స్ వర్క్ అవుట్ అయితే సినిమా పాస్ అవుతుంది. కానీ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అలా కాదు. సినిమాలో ప్రతి యాస్పెక్ట్ అలరించాలి. అందుకే ఘాటిలో అది వర్క్ కాలేదు ఆ సినిమాను ఆడియన్స్ ఆదరించలేదు. లోక సినిమాలో అది వర్క్ అవుట్ అయ్యింది దాన్ని సూపర్ హిట్ చేశారు.