Begin typing your search above and press return to search.

ఫీమేల్ సెంట్రిక్ సినిమాకు కొత్త టార్గెట్..?

లోక చాప్టర్ 1 చంద్ర సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అందుకుంది.

By:  Ramesh Boddu   |   10 Sept 2025 11:43 AM IST
ఫీమేల్ సెంట్రిక్ సినిమాకు కొత్త టార్గెట్..?
X

స్టార్ సినిమాలకు వచ్చినంత బజ్ అండ్ క్రేజ్ ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు ఉండదు. స్టార్ హీరోయిన్స్ ఉన్నా కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కొన్ని మాత్రమే ఆశించిన స్థాయిలో వర్క్ అవుట్ అవుతాయి. ఐతే ఫిమేల్ సెంట్రిక్ సినిమాల్లో కొత్త ఉత్సాహం తెచ్చిన సినిమా లోక. కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ సినిమాను డామెరిక్ అరుణ్ డైరెక్ట్ చేశాడు. దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందించారు.

లోక కొత్త ట్రెండ్..

లోక చాప్టర్ 1 చంద్ర సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఫిమేల్ సెంట్రిక్ సినిమాల్లో లోక కొత్త ట్రెండ్ సృష్టించింది. ఇన్నాళ్లు తెర మీద మనం చాలా మంది సూపర్ హీరో సినిమాలు చూశాం కానీ సూపర్ ఉమెన్ సినిమాటిక్ యూనివర్స్ గా లోక వచ్చింది. ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకే ఒక కొత్త జోష్ తెచ్చింది లోక. ఈ సినిమా చూశాక లేడీ ఓరియెంటెడ్ కథలు.. ఫిమేల్ సెంట్రిక్ గా మూవీస్ చేయాలని అనుకున్న వారి ఆలోచన మార్చుకునేలా చేసింది.

సినిమా ఎంచుకున్న కథ దాని ఎగ్జిక్యూషన్ ఇవన్నీ కూడా లోక కు ప్లస్ అయ్యాయి. ఐతే ఇక మీదట రాబోతున్న ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు లోక ఒక బెంచ్ మార్క్ మూవీగా అయ్యే ఛాన్స్ ఉంది. కథానాయిక బలమైన పాత్రలు అంటే ఎప్పుడు ఒకే విధంగా చూపిస్తారు. కానీ లోక ఒక కొత్త సూపర్ హీరోగా ఈ సినిమా తీశారు. అదే సినిమా సక్సెస్ కు రీజన్ అయ్యింది.

సూపర్ హీరో సినిమాలకు ధీటుగా..

లోక చాప్టర్ 1 చంద్ర సూపర్ హిట్ కాగా లోక సీరీస్ లు ఇంకా కొనసాగుతాయని తెలుస్తుంది. సో లోక ఫ్రాంచైజీలో మరో సూపర్ ఉమెన్ స్టోరీ ఏదైనా వస్తుందేమో చూడాలి. ఆడియన్స్ ని కొత్త కథలతో మెప్పించాలని చూస్తున్న మేకర్స్ సూపర్ హీరో సినిమాలకు ధీటుగా సూపర్ ఉమెన్ కథలతో సత్తా చాటాలని చూస్తున్నారు.

లోక తెచ్చిన ఈ మార్పులతో తప్పనిసరిగా ఫిమేల్ సెంట్రిక్ సినిమాల్లో కూడా కొత్త మార్పులు.. కొత్త కథలు వచ్చే ఛాన్స్ ఉంది. ఐతే ఓ పక్క ఇలా ఉమెన్ పవర్ ని కొత్త కథలతో చూపిస్తుంటే మరికొన్ని సినిమాలు మాత్రం కష్టపడి తీసినా కూడా వర్క్ అవుట్ అవ్వట్లేదు. లోక తెచ్చిన ఈ ఛేంజ్ రాబోయే ఫిమేల్ సెంట్రిక్ సినిమాలన్నీ స్వాగతించి న్యూ ట్రెండ్ సృష్టిస్తే బాగుంటుంది.