Begin typing your search above and press return to search.

లోక 2.. ఒక్కరు కాదు బాబోయ్ ఇద్దరు..!

లోక 1 లో క్యామియో రోల్స్ చేసిన దుల్కర్ సల్మాన్, టోవినో థామస్ లు లోక 2లో నటిస్తున్నారు.

By:  Ramesh Boddu   |   27 Sept 2025 2:03 PM IST
లోక 2.. ఒక్కరు కాదు బాబోయ్ ఇద్దరు..!
X

మలయాళంలో వచ్చిన సూపర్ హీరో ఫిమేల్ సెంట్రిక్ సినిమా లోక చాప్టర్ 1 చంద్ర. ఈ సినిమాతో కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించి మెప్పించింది. సూపర్ హీరో మూవీ అది కూడా ఉమెన్ సెంట్రిక్ గా రావడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఐతే లోక చాప్టర్ 1 చూశాక ఈ సినిమా ఫ్రాంచైజీలు కొనసాగుతాయని హింట్ ఇచ్చారు. లోక చాప్టర్ 2 కి సంబందించిన అఫీషియల్ అప్డేట్ వచ్చింది.


వెన్ లెజెండ్స్ చిల్.. మైఖెల్ అండ్ చార్లీ..

లోక 1 లో క్యామియో రోల్స్ చేసిన దుల్కర్ సల్మాన్, టోవినో థామస్ లు లోక 2లో నటిస్తున్నారు. లోక 2 టోవినో మాత్రమే లీడ్ రోల్ లో కనిపిస్తారని ఈమధ్య వార్తలు వచ్చాయి. కానీ వెన్ లెజెండ్స్ చిల్ మైఖెల్ అండ్ చార్లీ అంటూ ఒక పోస్టర్ వదిలారు. ఆ పోస్టర్ అటు దుల్కర్, ఇటు టోవినో ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. లోక 2 సినిమా కూడా క్రేజీగా ఉండబోతుందని అర్ధమవుతుంది.

డామెరిక్ అరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లోక 2 సినిమా కూడా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ఉండబోతుంది. ఐతే లోక 1 ఐతే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. కానీ లోక 2 పై భారీ హైప్ ఉంది. లోక సినిమాతో నిర్మాతగా కూడా తన కెపాసిటీ ప్రూవ్ చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఎందుకంటే ఫిమేల్ సెంట్రిక్ సినిమాకు 30 కోట్లు బడ్జెట్ అంటే మలయాళంలో చాలా పెద్ద రిస్కే. కానీ దుల్కర్ ఆ రిస్క్ తీసుకుని అందుకు తగిన రేంజ్ లో సక్సెస్ అందుకున్నాడు.

లోక చాప్టర్ 2 సంథింగ్ స్పెషల్..

ఇక నెక్స్ట్ లోక 2ని కూడా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వెళ్తున్నారని తెలుస్తుంది. లోక చాప్టర్ 2 సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందట. లోక 1 లో ఎలా అయితే స్పెషల్ క్యామియోస్ ఉన్నాయో పార్ట్ 2 లో ఎవరు ఊహించని కాంబినేషన్స్ సెట్ చేస్తారట. దుల్కర్, టోవినో ఉంటేనే ఆడియన్స్ కి స్పెషల్ ఫీస్ట్ అవుతుంది. ఇంకా కొన్ని స్పెషల్ క్యామియోస్ అంటే మాత్రం లోక 2 కూడా లోక 1 కి సరసన నిలిచేలా ఇంకా ఛాన్స్ ఉంటే దానికి మించి హిట్ కొట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు.

దుల్కర్ సల్మాన్ ఈమధ్య ఏం పట్టినా సరే అది బంగారమే అవుతుంది. తెలుగులో దాదాపు స్ట్రైట్ హీరోలానే ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక్కడ వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు దుల్కర్. అటు నిర్మాతగా లోక తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు.