Begin typing your search above and press return to search.

లోక 2కి అది మైనస్ అవ్వకూడదు అంటే..?

ఐతే ఆ అంచనాలకు తగినట్టుగానే లోక చాప్టర్ 2 ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా టోవినో థామస్ సూపర్ హీరోగా ఆడియన్స్ ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాడని అంటున్నారు.

By:  Ramesh Boddu   |   11 Nov 2025 1:02 PM IST
లోక 2కి అది మైనస్ అవ్వకూడదు అంటే..?
X

డామెరిక్ అరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లోక చాప్టర్ 1 చంద్ర బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కళ్యాణి ప్రియద్ర్శన్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో నెస్లెన్ కూడా నటించాడు. లోక 1 చంద్ర ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఫ్రాంచైజీగా పెద్ద ప్లానింగ్ లోనే ఉన్నారు. లోక సినిమాను దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ సినిమా బ్యానర్ లో నిర్మించారు. లోక చాప్టర్ 1 చంద్రలో మలయాళ స్టార్ టోవినో థామస్ స్పెషల్ క్యామియో తెలిసిందే. మైఖెల్ గా టోవినో ఎంట్రీ సర్ ప్రైజ్ చేస్తుంది.

లోక 1 చంద్ర జస్ట్ క్యామియోతో సరిపెట్టిన టోవినో..

లోక 1 చంద్ర జస్ట్ క్యామియోతో సరిపెట్టిన టోవినో నెక్స్ట్ లోక పార్ట్ 2లో లీడ్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. లోక 2 మైఖెల్, చార్లీ ఇద్దరు కూడా ఉంటారు. సినిమాలో ఛార్లీగా దుల్కర్ సల్మాన్ నటించనున్నాడు. లోక పార్ట్ 1 ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఐతే లోక 1 చంద్ర హిట్ అవ్వడంతో పార్ట్ 2 మీద భారీ అంచనాలు ఉంటాయి. ఇది కచ్చితంగా మేకర్స్ మీద ప్రెజర్ పెట్టేలా చేస్తుంది.

ఐతే ఆ అంచనాలకు తగినట్టుగానే లోక చాప్టర్ 2 ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా టోవినో థామస్ సూపర్ హీరోగా ఆడియన్స్ ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాడని అంటున్నారు. లోక 2 లో దుల్కర్ సల్మాన్ కూడా ఏదో అలా వచ్చి ఇలా వెళ్లే క్యామియోలా కాకుండా మంచి రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. లోక 1 చంద్ర కథలో పెద్దగా ట్విస్ట్ లు ఏమి లేవు కానీ పార్ట్ 2 పై ఉన్న అంచనాలు చేరుకునేందుకు ట్విస్టులు, టర్న్ లు ఉంటాయని తెలుస్తుంది.

30 కోట్ల బడ్జెట్ తో 300 కోట్ల కలెక్షన్స్..

ఐతే లోక 2 లో చంద్ర ఉంటుందా లేదా అన్నది కూడా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ గా మారింది. లోక 2 లో చంద్ర తో పాటు మైఖెల్, చార్లీ ఇద్దరు ఉంటే తప్పకుండా అదొక విజువల్ ఫీస్ట్ అందిస్తుందని అంటున్నారు. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన లోక చాప్టర్ 1 చంద్ర 300 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. అందుకే ఈసారి పార్ట్ 2 ని భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్.

లోక 2 లో చంద్ర, మైఖెల్, చార్లీ మాత్రమేనా ఇంకా ఏమైనా స్టార్ కలరింగ్ ఉందా అన్నది తెలియాల్సి ఉంది. హీరోగానే కాదు నిర్మాతగా దుల్కర్ చేస్తున్న సినిమాలు ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. స్టార్ హీరోగానే కాదు అభిరుచి గల నిర్మాతగా కూడా దుల్కర్ దూసుకెళ్తున్నాడని చెప్పొచ్చు.