Begin typing your search above and press return to search.

తొలి నటుడిగా మోహన్ లాల్ రికార్డ్..కొత్త లోక బ్రేక్ చేస్తుందా?

కథ, కంటెంట్ బాగుండి ప్రేక్షకులను మెప్పించింది అంటే అనూహ్యంగా ఆ సినిమా రూ.100 కోట్ల క్లబ్లో చేరుతుంది అనడంలో సందేహం లేదు.

By:  Madhu Reddy   |   6 Sept 2025 10:53 AM IST
తొలి నటుడిగా మోహన్ లాల్ రికార్డ్..కొత్త లోక బ్రేక్ చేస్తుందా?
X

కథ, కంటెంట్ బాగుండి ప్రేక్షకులను మెప్పించింది అంటే అనూహ్యంగా ఆ సినిమా రూ.100 కోట్ల క్లబ్లో చేరుతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఎన్నో చిత్రాలు చిన్న సినిమాలుగా విడుదలై.. రూ.100 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఇదంతా మిగతా భాషల సంగతి. కానీ మాలీవుడ్లో ఇప్పటివరకు రూ.100 కోట్లకు క్లబ్లో చేరిన చిత్రాలు లేవు అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు అలాంటి రికార్డును సృష్టించి తొలి నటుడిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు మోహన్ లాల్. ముఖ్యంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిన నటుడు గానే కాకుండా.. ఆ కలెక్షన్స్ తో హ్యాట్రిక్ అందుకోబోతున్న హీరోగా కూడా పేరు దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేయడానికి కళ్యాణి ప్రియదర్శన్ 'లోక :చాప్టర్ 1 చంద్ర' సినిమా సిద్ధమైంది అని తెలుస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అరుదైన హ్యాట్రిక్ ను సొంతం చేసుకున్నారు. ఇటీవల నేషనల్ అవార్డు అందుకున్న ఈయన తాజాగా నటించి, విడుదల చేసిన చిత్రం హృదయపూర్వం. ఇప్పుడు ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి ప్రవేశించింది. వరుసగా మూడు చిత్రాలతో రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలను అందించిన మొట్టమొదటి మాలీవుడ్ నటుడిగా మోహన్ లాల్ పేరు దక్కించుకున్నారు. ఈయన గత రెండు చిత్రాల విషయానికి వస్తే.. L2:ఎంపురాన్, తుడరుమ్.. ఈ రెండు చిత్రాలు కూడా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేశాయి.

ఇప్పుడు వచ్చిన హృదయపూర్వక సినిమా కూడా రూ.100కోట్ల క్లబ్లో చేరే దిశగా అడుగులు వేస్తూ ఉండగా సడన్గా.. మరొకవైపు ఈ చిత్రానికి పోటీగా. కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ పోషిస్తూ తాజాగా విడుదలైన చిత్రం లోక: చాప్టర్ 1.. ఈ చిత్రాన్ని తెలుగులో 'కొత్తలోక' అంటూ విడుదల చేసిన విషయం తెలిసిందే ఇక్కడ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ఈ సినిమా.. అప్పుడే ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమాకి ఎక్కువగా పాజిటివ్ టాక్ రావడంతో.. అటు మోహన్ లాల్ హృదయపూర్వం రూ.100 కోట్ల మైలురాయిని దాటే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. తెలుగులోనే కాకుండా మలయాళం లో కూడా ఈ చిత్రాన్ని చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలో.. ఇంత ఒత్తిడిని తట్టుకొని.. ఒకవేళ హృదయపూర్వం సినిమా గనుక పూర్తి రన్ ముగిసే సరికి 100 కోట్ల మార్క్ ను చేరితే మాత్రం మోహన్ లాల్ ఖాతాలో హ్యాట్రిక్ వచ్చి పడినట్లే అని చెప్పవచ్చు. మరి ఈ హ్యాట్రిక్ కి లోక చాప్టర్ వన్ అడ్డుగా నిలుస్తుందా? లేక మోహన్ లాల్ కి హ్యాట్రిక్ సక్సెస్ లభిస్తుందా అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది..

హృదయపూర్వం సినిమా విషయానికొస్తే.. ఇది మంచి అనుభూతినిచ్చే ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైనర్ గాతెరకెక్కించారు. ఇందులో మాళవిక మోహన్, సంగీత మాధవన్ నాయర్, సంగీత్ ప్రతాప్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రముఖ మాలీవుడ్ చిత్ర నిర్మాత సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించగా.. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై నిర్మాత అంటోనీ ఈ చిత్రాన్ని నిర్మించారు.