Begin typing your search above and press return to search.

'లోక' ఓటీటీ.. ఇలాంటి టాక్ స్ప్రెడ్ అయితే డేంజరే..

థియేటర్లలో బ్లాక్‌బస్టర్ అయిన ఈ సినిమాకు, ఓటీటీ ఆడియెన్స్ నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది.

By:  M Prashanth   |   1 Nov 2025 9:35 AM IST
లోక ఓటీటీ.. ఇలాంటి టాక్ స్ప్రెడ్ అయితే డేంజరే..
X

థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టిన ప్రతీ సినిమా, ఓటీటీలో కూడా అదే రేంజ్ మ్యాజిక్ చేస్తుందని గ్యారెంటీ లేదు. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ వేరు. అక్కడ సౌండ్, విజువల్స్, చుట్టూ ఉన్న ఆడియెన్స్ హైప్.. ఇవన్నీ యావరేజ్ కంటెంట్‌ను కూడా ఎలివేట్ చేస్తాయి. కానీ, ఓటీటీ అలా కాదు. రిమోట్ చేతిలో ఉంటుంది. నచ్చకపోతే పది సెకన్లలో ఫార్వార్డ్ కొట్టేస్తాం. ఇక్కడ కంటెంట్ మాత్రమే మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ ఓటీటీ రియాలిటీ చెక్ మలయాళ ఇండస్ట్రీకి గట్టిగా తగిలినట్లుంది.

ఇటీవల ఆగస్టులో రిలీజైన 'లోక చాప్టర్ 1 చంద్ర' సినిమా మాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ ఇండస్ట్రీకి మొట్టమొదటి 300 కోట్ల గ్రాసర్ కూడా ఇదే కావడం విశేషం. థియేటర్లలో ఈ సినిమాకు ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. కానీ, రీసెంట్‌గా ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇక్కడే అసలు కథ మొదలైంది.

థియేటర్లలో బ్లాక్‌బస్టర్ అయిన ఈ సినిమాకు, ఓటీటీ ఆడియెన్స్ నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా, మలయాళీ ఆడియెన్స్ కాకుండా ఇతర ఇండస్ట్రీలోని ఆడియెన్స్ ఈ సినిమాపై పెదవి విరుస్తున్నారు. కొంతమంది సినిమా డీసెంట్‌గా ఉందన్నారు. కానీ, చాలా మంది మాత్రం అంచనాలకు ఏమాత్రం దగ్గరగా లేదని, ఇదొక ఓవర్‌రేటెడ్ సినిమా అని తేల్చేశారు.

ఈ నెగెటివ్ ఓటీటీ టాక్ ఇప్పుడు మేకర్స్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే, 'లోక' అనేది ఒక సింగిల్ సినిమా కాదు. ఇది మల్టీ పార్ట్ ఫ్రాంచైజ్. ఇప్పటికే, టోవినో థామస్‌తో 'లోక చాప్టర్ 2'ను అధికారికంగా ప్రకటించారు. 2026 సమ్మర్‌లో షూటింగ్ కూడా ప్లాన్ చేశారు. ఒక సినిమాను పాపులర్ సూపర్ హీరో ఫ్రాంచైజ్‌గా మార్చాలంటే, దానికి పాన్ ఇండియా ఓటీటీ ఆడియెన్స్ సపోర్ట్ చాలా కీలకం.

'KGF', 'కాంతార' లాంటి సినిమాలు థియేటర్లలో ఆడినా, ఓటీటీలో ఇతర భాషల ఆడియెన్స్ చూశాకే వాటికి దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగింది. కానీ, 'లోక' సినిమాకు ఇతర భాషల ఓటీటీ ఆడియెన్స్ నుంచి ఆశించిన "సెన్సేషనల్ రెస్పాన్స్" రాకపోవడం మేకర్స్‌ను నిరాశపరిచే విషయమే. 'ఓవర్‌రేటెడ్' అనే టాక్ గనుక స్ప్రెడ్ అయితే, అది 'చాప్టర్ 2'పై చాలా గట్టి దెబ్బ కొడుతుంది. థియేటర్లలో వచ్చిన 300 కోట్లు చూసి సంతోషించాలో, ఇప్పుడు ఓటీటీలో వస్తున్న ఈ మిక్స్‌డ్ టాక్ చూసి నిరాశపడాలో తెలియక మేకర్స్ కన్ఫ్యూజన్‌లో పడ్డారు. ఈ ఓటీటీ రెస్పాన్స్ కచ్చితంగా 'లోక' ఫ్రాంచైజ్ భవిష్యత్తుపై ప్రభావం చూపించే ప్రభావం అయితే ఉంది. మరి మేకర్స్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి.