Begin typing your search above and press return to search.

సంచలనం సృష్టిస్తున్న కొత్తలోక.. ఏకంగా 365..

ఇప్పటివరకు సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరపై చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. అందుకే సూపర్ హీరో గెటప్ లో నటించే అవకాశం చాలా తక్కువ మందికి మాత్రమే లభించింది..

By:  Madhu Reddy   |   7 Sept 2025 4:10 PM IST
సంచలనం సృష్టిస్తున్న కొత్తలోక.. ఏకంగా 365..
X

ఇప్పటివరకు సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరపై చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. అందుకే సూపర్ హీరో గెటప్ లో నటించే అవకాశం చాలా తక్కువ మందికి మాత్రమే లభించింది..ముఖ్యంగా మన ఇండియన్ సెలబ్రిటీలలో చూసుకుంటే పట్టుమని పదిమంది కూడా ఈ సూపర్ హీరో పాత్రలో నటించలేదు అనడంలో సందేహం లేదు. అయితే హీరోలకే దక్కని ఈ అరుదైన ఛాన్స్ ను కళ్యాణి ప్రియదర్శన్ దక్కించుకుంది. అంతేకాదు తొలిసారి సూపర్ హీరో క్యారెక్టర్ లో నటించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇండియన్ సినీ హిస్టరీలో సూపర్ హీరో క్యారెక్టర్ పోషించిన తొలి హీరోయిన్ గా కూడా రికార్డ్ సృష్టించింది ఈ ముద్దుగుమ్మ

అలా సూపర్ హీరో కాన్సెప్ట్ తో కళ్యాణి ప్రియదర్శన్ నటించిన చిత్రం 'కొత్తలోక.. మలయాళం 'లోక చాప్టర్ వన్: చంద్ర' అనే పేరుతో వచ్చిన ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. అటు మలయాళం లోనే కాదు ఇటు తెలుగులో కూడా సత్తా చాటుతూ దూసుకుపోతోంది. ఇప్పటికే లాభాల బాట పట్టిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తోంది అని చెప్పవచ్చు.పైగా అటు థియేటర్లకు పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరో సరికొత్త నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం జనాలలో ఎక్కడ చూసినా లోకా చాప్టర్ వన్: చంద్ర ఫీవర్ పట్టుకుంది. మలయాళం లో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబడుతోంది. ముఖ్యంగా ఈ సూపర్ హీరో కథను ప్రేక్షకులకు విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించగా.. దుల్కర్ సల్మాన్ నిర్మించారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. పైగా మొదటి వారం తర్వాత కూడా అందరి అభిమాన చిత్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల డిమాండ్ తీర్చడానికి శనివారం 365 కు పైగా లేట్ నైట్ షోలు జోడించబడ్డాయి. ముఖ్యంగా ఈ రేంజ్ లో ప్రేక్షకుల నుండి డిమాండ్ పొందిన చిత్రం మరొకటి లేదు అనడంలో సందేహం లేదు. అలా 365 లేట్ నైట్ షోలు ప్రత్యేకంగా వేయబడ్డ సినిమాగా కూడా ఇది సంచలనం సృష్టించింది.

ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాతో పాటు పెద్ద చిత్రాలు విడుదల అయినప్పటికీ కూడా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. భారీ కలెక్షన్లు అందుకుంటూ దూసుకుపోతోంది. మలయాళం లో మోహన్ లాల్ హృదయపూర్వం, తెలుగులో సెప్టెంబర్ 5న మదరాసి, ఘాటి, లిటిల్ హార్ట్స్ చిత్రాలు కూడా విడుదలయ్యాయి. ఇప్పుడు ఈ చిత్రాల ధాటిని కూడా తట్టుకొని ముందుకు సాగుతోంది ఈ సినిమా. ఇందులో ప్రేమమ్ మూవీ ద్వారా పరిచయమైన నెస్లాన్ తోపాటు శాండీ మాస్టర్, టోవినో థామస్, సన్నీ వేన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అంతేకాదు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన దుల్కర్ సల్మాన్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించారు.