Begin typing your search above and press return to search.

కొత్త రికార్డులు సృష్టిస్తున్న కొత్త లోక..!

మలయాళ సినిమా గోల్డెన్ పీరియడ్ నడుస్తుందని చెప్పొచ్చు. అక్కడ నుంచి సినిమా వస్తుంది అంటే చాలు ఆడియన్స్ లో ఒక సూపర్ ఎగ్జైట్ మెంట్ ఉంటుంది.

By:  Ramesh Boddu   |   1 Sept 2025 10:16 AM IST
కొత్త రికార్డులు సృష్టిస్తున్న కొత్త లోక..!
X

మలయాళ సినిమా గోల్డెన్ పీరియడ్ నడుస్తుందని చెప్పొచ్చు. అక్కడ నుంచి సినిమా వస్తుంది అంటే చాలు ఆడియన్స్ లో ఒక సూపర్ ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. ఇప్పటికే అక్కడ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో ఒక ఊపు ఊపేస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా వచ్చిన ఒక సినిమా మరింత సందడి చేస్తుంది. కళ్యాణ్ ప్రియదర్శన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా లోక తెలుగులో కొత్త లోక గా రిలీజైంది. ఈ సినిమాను డామెరిక్ అరుణ్ డైరెక్ట్ చేశారు. మలయాళంలో ఫస్ట్ సూపర్ ఉమెన్ సినిమాటిక్ సీరీస్ గా లోక చాప్టర్ 1 చంద్ర ని తెరకెక్కించారు.

రిలీజ్ వీకెండ్ 40 కోట్ల గ్రాస్..

ఈ సినిమాకు అన్నిచోట్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి. రిలీజ్ వీకెండ్ 40 కోట్ల గ్రాస్ తో దూసుకెళ్లింది లోక. మండే కూడా 9 నుంచి 10 కోట్ల దాకా రాబట్టొచ్చని అంచనా వేస్తున్నారు. సో అలా జరిగితే 50 కోట్ల మార్క్ టచ్ చేస్తుంది కొత్త లోక. ఈ సినిమాను వేఫరర్ ఫిలింస్ బ్యానర్ లో దుల్కర్ సల్మాన్ ఈ సినిమా నిర్మించారు. సినిమాకు దాదాపు 30 కోట్ల దాకా వర్క్ జరిగిందని తెలుస్తుంది.

కొత్త లోక అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఈ ఇయర్ లో వచ్చిన గొప్ప సినిమాల్లో ఇది ఒకటని అంటున్నారు. అంతేకాదు మలయాళ పరిశ్రమ నుంచి ఒక కొత్త సినిమాటిక్ యూనివర్స్ మొదలైందని కూడా చర్చిస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా ఫాహద్ ఫాజిల్ ఒదుం కితిరా చదుం కుతిర, మోహన్ లాల్ హృదయపూర్వం సినిమాలు రిలీజ్ అయ్యాయి.

మోహన్ లాల్ 265 కోట్ల రికార్డ్..

ఐతే మలయాళ పరిశ్రమలో హైయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా మోహన్ లాల్ నటించింది ఎల్2 ఎంపురాన్. ఎంపురాన్ సినిమా 265 కోట్లతో రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత మోహన్ లాల్ తుడరుం కూడా 235 కోట్ల దాకా రాబట్టింది. హృదయపూర్వం కి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఐతే రేసులో మాత్రం దూసుకెళ్తుంది కళ్యాణి ప్రియదర్శన్ లోక సినిమా.

ఈ సినిమా లో దుల్కర్ సల్మాన్, టోవినో థామస్, సౌబిన్ షాహిర్ క్యామియో రోల్స్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. కొత్త లోక తెలుగు ఆడియన్స్ ని కూడా సర్ ప్రైజ్ చేసింది. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. లోక సినిమా వీకెండ్ లోనే క్రేజీ కలెక్షన్స్ రాబట్టింది. ఇక వీక్ డేస్ లో సినిమా ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అన్నది చూడాలి