Begin typing your search above and press return to search.

లోకా చాప్టర్ 1.. తెలుగులో కాస్త స్పీడ్ పెంచుంటే...

మాలీవుడ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్.. రీసెంట్ గా లోకా చాప్టర్ 1 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   3 Oct 2025 1:08 PM IST
లోకా చాప్టర్ 1.. తెలుగులో కాస్త స్పీడ్ పెంచుంటే...
X

మాలీవుడ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్.. రీసెంట్ గా లోకా చాప్టర్ 1 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మ‌ల‌యాళం జానపదం నుంచి తీసుకున్న క‌థ ఆధారంగా దానికి సూప‌ర్ వుమెన్ కాన్సెప్ట్ ను యాడ్ చేసి దర్శకుడు డామినిక్ అరుణ్ తెరకెక్కించారు. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గ్రాండ్ గా నిర్మించారు.

ఐదు వారాల క్రితం రిలీజ్ అయిన ఆ సినిమా.. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. అన్ని వర్గాల ఆడియన్స్ ను తెగ మెప్పిస్తోంది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. అనేక రికార్డులు ఇప్పటికే బద్దలు కొట్టిన లోకా చాప్టర్ 1.. ఇప్పుడు మరిన్నింటిని బ్రేక్ చేయనుంది. క్రియేట్ కూడా చేయనుంది.

మాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా లోకా చాప్టర్ 1 ఇప్పటికే నిలిచింది. మహానటి, రుద్రమదేవి వంటి చిత్రాల కంటే ఎక్కువ వసూళ్లు సాధించిన సౌత్ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాగా ఘనత సాధించింది. మాలీవుడ్ లో అత్యధిక ఫుట్ ఫాల్స్ రాబట్టిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది లోకా చాప్టర్ 1.

ఇప్పుడు మరికొద్ది రోజుల్లో రూ.300 కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. అదే సమయంలో కేరళలో ఇప్పటికీ పెద్ద ఎత్తున వసూళ్లను రాబడుతోంది. నెల దాటినా ఆడియన్స్ థియేటర్స్ కు తరలివెళ్తున్నారు. అయితే తెలుగులో మాత్రం అనుకున్నంత రేంజ్ లో మాత్రం లోకా మూవీ వసూళ్లు సాధించలేదు. ఎక్కువ సందడి కూడా చేయలేదు.

దానికి ముఖ్య కారణం ప్రమోషన్సే. తెలుగు రాష్ట్రాల్లో సితార డిస్ట్రిబ్యూషన్ సంస్థ లోకా మూవీని రిలీజ్ చేసింది. దీంతో పెద్ద ఎత్తున సినిమాను ప్రమోట్ చేస్తారని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అలా జరగలేదు. అనుకున్న రేంజ్ లో ప్రమోషన్స్ నిర్వహించలేదు. తెలుగులో కూడా వసూళ్ల విషయంలో మరో స్థాయికి వెళ్లాల్సిన మూవీ లోకా.

కానీ తక్కువ ప్రమోషన్స్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టే రేంజ్ కు వెళ్లలేకపోయింది. అయితే తెలుగులోనే కాదు.. మలయాళం తప్ప మిగతా రీజనల్ లాంగ్వేజెస్ లో అదే జరిగింది. అందుకే మాలీవుడ్ నుంచే లోకా మూవీకి భారీ కలెక్షన్లు వస్తున్నాయి. కొత్త రికార్డులు క్రియేట్ చేసేలా దోహదపడుతున్నాయి. మరి ఫుల్ రన్ లో లోకా చాప్టర్ 1 మూవీ ఎంత వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.