Begin typing your search above and press return to search.

ఒకటి అనుకుంటే ఇంకోటి అయ్యింది

మూడో వారంలోనూ స్థిరమైన కలెక్షన్లతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది.

By:  M Prashanth   |   17 Sept 2025 7:00 AM IST
ఒకటి అనుకుంటే ఇంకోటి అయ్యింది
X

ఇండియన్ బాక్సాఫీస్‌లో కొత్త లోక ఛాప్టర్ 1 సినిమా సంచలనం సృష్టిస్తోంది. మలయాళంలో తొలి లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో చిత్రంగా విడుదలైన లోక మొదట్లో మలయాళంలోనే హైప్ సృష్టించినా, తర్వాత ఇతర భాషల్లో కూడా దూసుకుపోతూ అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది.

మూడో వారంలోనూ స్థిరమైన కలెక్షన్లతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపు రూ.250 కోట్ల వసూళ్లను సాధించి, మలయాళ ఇండస్ట్రీలో ఆల్- టైమ్ హైయెస్ట్ వసూళ్లలో రెండో స్థానంలో నిలిచింది. రిలీజై మూడు వారాలైనా టికెట్ సేల్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. అలా ఈ సినిమాకు ఆల్ ఓవర్ క్లీన్ హిట్ లభించింది. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ తన సొంత నిర్మాణ సంస్థ వే ఫేరర్ ఫిల్మ్స్ పై ఈ సినిమాను రూపొందించారు.

అయితే, విడుదలకు ముందు ఈ సినిమా సరైన బిజినెస్ జరగకపోవడంతో నష్టాలు తప్పవని దుల్కర్ మొదట భావించారట. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్ తో ఆయన ఈ సినిమా నిర్మించారు. టాలీవుడ్‌ లో ఇది పెద్ద బడ్జెట్ కాకపోవచ్చు. కానీ మలయాళ సినిమా మార్కెట్‌ లో అదీనూ.. లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఇంత ఖర్చు పెట్టడం పెద్ద సాహసమే. అయితే, ఊహించని ఖర్చులు, లేడీ ఓరియెంటెడ్ కథ కావడంతో బిజినెస్ అంచనాలకు మించి జరగలేదు.

దీంతో, దుల్కర్ తన నిర్మాణ సంస్థలో మొదటిసారి నష్టాలను ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమయ్యారట. భారీ ఫెయిల్యూర్ తప్పదని భావించారట. సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కినప్పటికీ.. వసూళ్లు మాత్రం పెద్దగా రావని దుల్కర్ అనుకున్నారట. కానీ, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ, కొత్త లోక సినిమా భారీ విజయం అందుకుంది.

సూపర్ కలెక్షన్లతో రికార్డులను బద్దలు కొడుతుంది. ఈ రేంజ్ ఫలితం దుల్కర్ ఊహించలేదు. ఈ విజయం ఇప్పటికీ అతనికి నమ్మశక్యంగా లేదని చెప్పారు. ఈ కథను దర్శకుడు చాలా మంది నిర్మాతలకు చెప్పినప్పటికీ.. లేడీ ఓరియెంటెడ్ చిత్రం కావడంతో ఎవరూ ముందుకు రాలేదు. దర్శకుడు ఈ విషయాన్ని దుల్కర్‌తో పంచుకున్నప్పుడు, నన్నెందుకు నిర్మాతగా అనుకోవడం లేదని దుల్కర్ స్వయంగా ముందుకొచ్చి ఈ ప్రాజెక్ట్‌ ను నిర్మించడం మాత్రమ ప్రశంసించగ్గ విషయమే.

కాగా, లోక సినిమాలో కళ్యాణి ప్రియదర్శిణి లీడ్ రోల్ లో నటించారు. ఈ సినిమా ఓ ఫ్రాంచైజీగా రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే చెప్పారు. అందులో భాగంగానే ఇంకో ఐదు సినిమాలు సీక్వెల్గా రానున్నాయి.