5 పార్ట్ లుగా లోక ఫ్రాంచైజీ.. అదొక్కటి చూసుకుంటే బెస్ట్ యూనివర్స్ అవుతుంది!
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడానికి సింపుల్ కథలు సరిపోవడం లేదు. ప్రేక్షకులకు ఎగ్జైటింగ్ గా అనిపించాలి. అయితేనే థియేటర్లకు వస్తున్నారు.
By: M Prashanth | 2 Sept 2025 7:11 PM ISTఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడానికి సింపుల్ కథలు సరిపోవడం లేదు. ప్రేక్షకులకు ఎగ్జైటింగ్ గా అనిపించాలి. అయితేనే థియేటర్లకు వస్తున్నారు. అందుకే చాలా మంది నిర్మాతలు సీక్వెల్స్, క్రాస్ఓవర్ సినిమాలు, సినిమాటిక్ యూనివర్స్ గా నిర్మిస్తున్నారు. ఈ ప్లాన్ బాక్సాఫీస్ వర్కౌట్ అవుతున్నాయి. అందుకే దాదాపు అందరు నిర్మాతలు ఇదే ఫాలో అయిపోతున్నారు.
అయితే తాజాగా వచ్చిన లోకా చాప్టర్ 1 సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స అందుకుంది. ఈ సినిమా కలెక్షన్లతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మొదటి వీకెండ్ తర్వాత కూడా.. ఈ చిత్రం నిలకడగా రాణిస్తుుంది. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. దాదాపు రూ. 35 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. కానీ విజువల్స్ క్వాలిటీ మాత్రం సర్ ప్రైజ్ చేస్తుంది. వందల కోట్ల సినిమాలాగా అనిపిస్తుంది.
బాక్సాఫీస్ వద్ద తొలి వీకెండ్ లోనే రూ. 100 కోట్ల వసూళ్లు సాధించడానికి టార్గెట్ పెట్టుకుంది.ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఈజీగా రూ. 200 కోట్లు దాటవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ విజయం కారణంగా లోకా ఇప్పుడు మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ భాషలలో కూడా పెద్ద బ్రాండ్‌గా మారుతోంది. OTT విడుదల తర్వాత, ఈ చిత్రం మరింత విస్తృత ప్రేక్షకులకు చేరువవుతుంది.
దీంతో సినిమా సీక్వెల్స్ కు దేశవ్యాప్తంగా బలమైన డిమాండ్ ఏర్పడుతుంది. లోకా సినిమా ఐదు భాగాలగా సిరీస్ గా రానుందని చిత్రబృందం ఇప్పటికే కన్ఫార్మ్ చేసింది. మొదటి చిత్రం షూటింగ్ ప్రారంభించక ముందే.. ఐదు సిరీస్ ల కథలు సిద్ధంగా ఉన్నాయని దర్శకుడు అరుణ్ అన్నారు. అలాగే చంద్ర పాత్ర పరిచయంతోనే ఈ సిరీస్ లో మెయిన్ విలన్ గురించి క్లూ కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు.
ఈ విజయంతో ప్రేక్షకులు కొత్త తరహా స్టోరీలు ఆదరించడానికి రెడీ ఉన్నారని ఈ సినిమా నిరూపించింది. ఈ ఫ్రాంచైజీ నుంచి రానున్న భాగాలు కూడా అదే క్వాలిటీ అందిస్తే.. లోకా భారతీయ సినిమా నుండి అతిపెద్ద సినిమాటిక్ యూనివర్స్ లల్లో ఒకటిగా అవుతుంది.
