సూపర్ హిట్ మూవీ.. 'క్యారెక్టర్ లెస్' వివాదం!
కళ్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రలో డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం 'లోకా చాప్టర్ : 1 చంద్ర' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
By: Ramesh Palla | 3 Sept 2025 2:18 PM ISTకళ్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రలో డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం 'లోకా చాప్టర్ : 1 చంద్ర' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి వారం రోజుల్లోనే దాదాపు రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా లాంగ్ రన్‌లో రూ.200 కోట్లకు మించి వసూళ్లు సాధిస్తుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్‌తో పాటు నస్లెన్ , శాండీ, అరుణ్ కురియన్ , చందు సలీంకుమార్, నిశాంత్ సాగర్ , రఘునాథ్ పలేరి , విజయరాఘవన్ , నిత్యశ్రీ, శరత్ సభ నటించారు. ఈ సూపర్ హీరో సినిమా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ మధ్య కాలంలో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవుతున్నా ఈ సినిమా మాత్రం కేవలం రూ.30 కోట్లతో రూపొంది రూ.200 కోట్ల దిశగా పరుగులు పెట్టడం విశేషం.
జాన్వీ కపూర్ పరమ్ సుందరి వివాదం
సాధారణం హిట్ అయిన సినిమాలకు ఏదో ఒక రకంగా విమర్శలు ఎదురు కావడం కామన్ విషయం. ఏ సినిమా అయినా ఏదో ఒక చిన్న తప్పు లేదా లోపంతో ఉంటుంది అంటారు. కొన్ని రోజుల క్రితం వచ్చిన బాలీవుడ్ మూవీ పరమ్ సుందరి సినిమాలో మలయాళ అమ్మాయిలను తక్కువ చేసి చూపించారని, వారిని చిన్నచూపు చూసే విధంగా సినిమాలో హీరోయిన్ పాత్ర ఉందనే విమర్శలు వచ్చాయి. కేరళ మొత్తం ఈ విషయం గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. అయితే జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేదు. సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. దాంతో సినిమాలోని ఆ వివాదాస్పద విషయం జాతీయ స్థాయికి వెళ్లలేదు. కానీ లోకా సినిమాకు సంబంధించిన వివాదం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.
లోకా చాప్టర్ 1 సూపర్ హిట్
లోకా సినిమాలో ఒకానొక సీన్‌లో బెంగళూరు అమ్మాయిలు క్యారెక్టర్ లెస్ అనే డైలాగ్ ఉంటుంది. అలాంటి వారిని పెళ్లి చేసుకోను అన్నట్లుగా ఒక పాత్ర డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ఇప్పుడు కన్నడ జనాలకు తీవ్ర ఆగ్రహం ను తెప్పించింది. బెంగళూరు అమ్మాయిలను అంత మాట అంటూ చెప్పిన ఆ డైలాగ్‌ను వెంటనే తొలగించడంతో పాటు, దర్శకుడు, చిత్ర యూనిట్ సభ్యులు అంతా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మొత్తం కన్నడ జనాలను అవమానించినట్లుగా ఆ డైలాగ్ ఉంది అంటూ చాలా మంది రోడ్డు ఎక్కుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే బెంగళూరు అంటే ఒక చెడ్డ ప్లేస్ అన్నట్లుగా చూపిస్తున్నారు, అక్కడకు వెళ్లి చెడి పోయినట్లుగా చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కథలు రాసుకుంటున్నారు. అందుకే ఈ విషయాన్ని వదిలి పెట్టబోము అంటూ కన్నడిగులు అంటున్నారు.
రూ.100 కోట్లను మించిన లోకా
లోకా చాప్టర్ : 1 చంద్ర సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ పోషించిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. కెరీర్ ఆరంభించి చాలా ఏళ్లు అయినప్పటికీ ఆమెకు దక్కాల్సిన గుర్తింపు, గౌరవం దక్కలేదు. ఇన్నాళ్లకు ఆమెకు ఈ సినిమాతో ఒక సాలిడ్ హిట్ దక్కింది. సౌత్ ఇండియాలో ఇతర ఏ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాకు దక్కని రూ.100 కోట్ల వసూళ్లు ఈ సినిమాకు దక్కడం విశేషం. బాలీవుడ్ సినిమాలతో సమానంగా ఈ సినిమా వసూళ్లు సాధిస్తున్న నేపథ్యంలో పాన్ ఇండియా హిట్ అంటూ ప్రచారం జరుగుతోంది. తెలుగులో ఈ సినిమాను కొత్త లోక అనే టైటిల్‌తో విడుదల చేశారు. తెలుగులో మొదటి రోజు మోస్తరు ఓపెనింగ్ లభించినా తర్వాత రోజు నుంచి మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో మలయాళ ఇండస్ట్రీ నుంచి ఈ స్థాయి లేడీ ఓరియంటెడ్ మూవీ రావడం, భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం చూడలేదు. లోకా నుంచి ముందు ముందు మరిన్ని సినిమాలు వస్తాయని, దర్శకుడు అరుణ్ చాలా ప్లాన్ తో లోకా ప్రాంచైజీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు సమాచారం అందుతోంది.
