లిటిల్ హార్ట్స్ ట్రైలర్.. ఎలా ఉందంటే..
సూపర్ హిట్ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు.
By: M Prashanth | 30 Aug 2025 4:58 PM ISTటాలీవుడ్ యూత్ మూవీ లవర్స్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ మౌళి తనుజ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫేమ్ శివాని నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ లిటిల్ హార్ట్స్. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు.
సూపర్ హిట్ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అదే సమయంలో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ తో పాటు సాంగ్స్ ను మంచి రెస్పాన్స్ వచ్చింది. నాట్ టచింగ్.. ఓన్లీ హార్ట్ టచింగ్ అంటూ యూత్ ను ఆకట్టుకునే అంశాలతో సినిమా తీస్తున్నట్లు టీజర్ బట్టి అర్థమవుతుంది. సరదాగా సాగే టీనేజ్ ప్రేమ కథతో మూవీ అంతా సింపుల్ అండ్ ప్లెజెంట్ గా ఉండనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
అయితే తాజాగా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 5 నుండి పీక్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధం అవ్వండి. ఉల్లాసకరమైన లిటిల్ హార్ట్స్ ట్రైలర్ తో నాన్-స్టాప్ లాఫ్టర్ రైడ్ ను స్టార్ట్ చేయండి. చదువు రానోళ్ళు టీచర్స్ డే నాడు వస్తున్నారు అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రైలర్ ఫుల్ వైరల్ అవుతోంది.
ఈ స్టోరీ జియో సిమ్ రాకముందు జరిగిందంటూ ఫన్నీగా ట్రైలర్ గా స్టార్ట్ అయింది. ఆ తర్వాత మౌళిని అఖిల్ గా.. సైనికపురిలో చదువు రానోడుగా పరిచయం చేశారు మేకర్స్. హీరో తండ్రిగా రాజీవ్ కనకాల కనిపించనుండగా.. కొడుకును తిడుతుంటారు. అనంతరం హీరోయిన్ కు చదువురాదని తండ్రీకూతుళ్లను పరిచయం చేశారు.
హీరో హీరోయిన్లు లవ్ లో పడతారు. ప్రేమలో మునిగితేలుతుంటారు. సడెన్ గా హీరోయిన్ వాళ్లు బెంగళూరు షిఫ్ట్ అవుతారు. అప్పుడేం జరిగింది? వారు లవ్ ఏమైంది? అన్నదే లిటిల్ హార్ట్స్ మూవీగా తెలుస్తోంది. చివర్లో.. చదువురాని ఇద్దరి హృదయాల మధ్య జరిగిన సంఘర్షణ సినిమా అంటూ మేకర్స్ ట్రైలర్ ను ఎండ్ చేశారు.
అయితే ట్రైలర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. యూత్ ను ఆకట్టుకునే విధంగా మూవీ ఉండనుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. సినిమాలోని క్యాస్టింగ్ అంతా తమ పాత్రల్లో ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నారు. డైలాగ్స్ ఫన్నీగా ఉన్నాయి. కామెడీ ఫుల్ గా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా అంతా నేచురల్ గా తీసినట్లు తెలుస్తోంది. మరి లిటిల్ హార్ట్స్ ట్రైలర్ ను మీరు చూశారా? మీకెలా అనిపించింది?
