గ్లామర్ టచ్ తో మెస్మరైజ్ చేస్తున్న తెలుగమ్మాయి!
ఆధునికతతో కూడిన సంప్రదాయ సౌందర్యం అభిమానులను ఆకట్టుకుంది..ఇక తాజాగా శివాని షేర్ చేసిన ఫోటో షూట్ విషయానికి వస్తే, ఆమె తన గ్లామరస్ లుక్స్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
By: Madhu Reddy | 1 Feb 2026 9:53 AM ISTసినిమా రంగంలో తెలుగమ్మాయిల సందడి ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఆ జాబితాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ శివాని నగరం. చూడగానే ఆకట్టుకునే రూపం, చురుకైన కళ్లతో కుర్రకారు మనసు గెలుచుకుంటున్న ఈ చిన్నది, కేవలం అందంతోనే కాకుండా తన నటనతోనూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. స్వచ్ఛమైన తెలుగింటి కళతో పాటు గ్లామర్ టచ్ ఇస్తూ టాలీవుడ్‌లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన ఈ బ్యూటీ, తనదైన శైలిలో రాణిస్తూ అగ్ర కథానాయికల సరసన చేరేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఆమె ఫొటోషూట్ సోషల్ మీడియా లో షేర్ చేసింది..ఆ ఫొటోలతో కుర్ర కారు మతి పోగొడుతుంది.

‘లిటిల్ హార్ట్స్’ నుండి ‘హే భగవాన్’ వరకు:
శివాని నగరం ఇటీవల విడుదలైన ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో తన అద్భుతమైన నటనను ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటి సినిమాతోనే మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి, పరిశ్రమలో తనకంటూ ఒక బలమైన పునాదిని వేసుకుంది. ఈ విజయంతో ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. తాజాగా టాలెంటెడ్ హీరో సుహాస్ సరసన ‘హే భగవాన్’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో శివాని కెరీర్ మరో మలుపు తిరుగుతుందని, సుహాస్-శివానిల కెమిస్ట్రీ తెరపై కొత్తగా ఉంటుందని ఫాన్స్ ఆశిస్తున్నారు.
ఫోటో షూట్ సందడి:

ఆధునికతతో కూడిన సంప్రదాయ సౌందర్యం అభిమానులను ఆకట్టుకుంది..ఇక తాజాగా శివాని షేర్ చేసిన ఫోటో షూట్ విషయానికి వస్తే, ఆమె తన గ్లామరస్ లుక్స్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఫోటోల్లో శివాని స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో మెరుస్తూ, తన స్టైలిష్ పోజులతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. లేత రంగు దుపట్టలో కూడా ఒక రకమైన హుందాతనాన్ని, రాజసాన్ని ఒలికిస్తూ ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ హైలైట్‌గా నిలిచాయి.

వెలుగునీడల నడుమ ఆమె కళ్ళలోని మెరుపు, ఆ కాన్ఫిడెంట్ స్మైల్ చూస్తుంటే వెండితెరపై మరో గ్లామర్ స్టార్ రాణిస్తుంది అని అనిపించక మానదు. మరి ఈ ఫోటోలు చూసిన అభిమానులు ‘నేచురల్ బ్యూటీ’ అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
