బ్లాక్ బస్టర్ 'లిటిల్ హార్ట్స్' టీమ్.. ఇప్పుడు నిజమైన ప్రేమకథతో..
రీసెంట్ గా వచ్చిన లిటిల్ హార్ట్స్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
By: M Prashanth | 29 Oct 2025 4:03 PM ISTరీసెంట్ గా వచ్చిన లిటిల్ హార్ట్స్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా విడుదల అయిన ఆ చిత్రం.. బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా యంగ్ హీరో మౌళి తనూజ్, శివానీ నాగారం జంటగా నటించిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అనేక రెట్లు లాభాలు అందుకుని అదరగొట్టింది.
సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను ఈటీవీ విన్ లో ఆదిత్య హసన్ నిర్మించారు. తొలుత మూవీని ఓటీటీ ఈటీవీ విన్ లో ఎక్స్ క్లూజివ్ గా రిలీజ్ చేయాలని భావించారు. కానీ కంటెంట్ పై నమ్మకంతో థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవ్వగా.. బన్నీ వాస్, వంశీ నందిపాటి లిటిల్ హార్ట్ రైట్స్ ను కొనుగోలు చేసి విడుదల చేశారు.
బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించిన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు అదే స్ట్రాటజీని మరో సినిమా రాజు వెడ్స్ రాంబాయికి ఫాలో అవుతున్నారు. విరాట పర్వంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వేణు ఊడుగుల.. ఆ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ మోపిదేవి, ఈటీవీ విన్‌లతో కలిసి సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు.
సాయిలు కంపాటిని దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. నవంబర్ 21వ తేదీన రిలీజ్ కానుంది. ఆ విషయాన్ని తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. అన్ని అడ్డంకులను ధిక్కరించే గొప్ప ప్రేమకథను సెలబ్రేట్ చేసుకోండంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టర్ తోపాటు గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
అయితే ఈటీవీ విన్, రాహుల్ మోపిదేవి, వేణు ఊడుగుల నిర్మిస్తున్న మూవీకి ఇప్పుడు వంశీ నందిపాటి, బన్నీ వాసు కూడా సపోర్ట్ గా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి లిటిల్ హార్ట్స్ టీమ్ రిపీట్ అవుతోంది. ఇప్పుడు కూడా చిన్న సినిమాగా థియేటర్స్ లోకి వస్తున్న రాజు వెడ్స్ రాంబాయి ఎంతటి హిట్ గా నిలుస్తుందనేది ఆసక్తికరం.
ఇక సినిమా విషయానికొస్తే.. అఖిల్, తేజస్వి రావ్ హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. ప్యూర్ లవ్ స్టోరీ రూపొందుతున్న ఆ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. మిట్టపల్లి సురేందర్ సాహిత్య రచయితగా వర్క్ చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా వాజిద్ బేగ్ వ్యవహరిస్తుండగా.. ఎడిటింగ్ బాధ్యతలు నరేష్ అడుప నిర్వర్తిస్తున్నారు. మరి వచ్చే నెలలో రానున్న ఆ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.
