పేరు మార్చుకున్న లిటిల్ హార్ట్స్ బ్యూటీ.. కొత్తగా ఉందే!
అసలు విషయంలోకి వెళ్తే.. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఈ ముద్దుగుమ్మ.. లిటిల్ హార్ట్స్ తో సంచలన విజయం అందుకుంది. కేవలం రూ.2కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.20 కోట్లకు పైగా వసూలు చేసింది.
By: Madhu Reddy | 11 Sept 2025 3:36 PM ISTగాయనిగా కెరియర్ మొదలుపెట్టి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో హీరోయిన్ గా మారిన శివాని నాగారం గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తాజాగా వచ్చిన 'లిటిల్ హార్ట్స్' సినిమాతోనే వెలుగులోకి వచ్చిన ఈమె ఈ సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా అటు సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ భారీగా పెరిగిపోయారని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఈ ఒక్క సినిమా విజయం సాధించడంతో ఈమె పేరు మార్చుకున్నట్లు సమాచారం. మరి శివాని నాగారం పెట్టుకున్న కొత్త పేరు ఏంటి ? ఎందుకు తన పేరును మార్చుకుంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
అసలు విషయంలోకి వెళ్తే.. సాధారణంగా ఏ రంగంలో అయినా సరే వ్యక్తులు అదృష్టం కోసం తమ పేర్లను మార్చుకోవడం లేదా తమ పేరులోని అక్షరాలను మార్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే లిటిల్ హార్ట్స్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న శివాని కూడా తన పేరును మార్చుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారిపోయింది.
అసలు విషయంలోకి వెళ్తే.. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఈ ముద్దుగుమ్మ.. లిటిల్ హార్ట్స్ తో సంచలన విజయం అందుకుంది. కేవలం రూ.2కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.20 కోట్లకు పైగా వసూలు చేసింది. థియేటర్లలోకి వచ్చి వారం కూడా కాలేదు అప్పుడే సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో మౌళి సరసన హీరోయిన్ గా శివానీ కాత్యాయని ఆకుల పాత్ర పోషించి.. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో తన నటనతో అందర్నీ అలరించడమే కాకుండా ఈమె పోషించిన ఈ పాత్ర కూడా ఈమెకు మంచి పేరు తీసుకు వచ్చింది. పైగా ఈ సినిమాలో ఈమె పేరు మీద ఉన్న రెండు పాటలు కూడా భారీ ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకున్నాయి. దీంతో ఈ పాత్ర ఈమె పై శాశ్వత ముద్ర వేసిందని చెప్పవచ్చు.
అందుకే కాత్యాయని పాత్రకు వచ్చిన స్పందనను చూసి శివాని తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. తన ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ ను శివాని నుండి కాత్యాయని ఆకులగా మార్చుకుంది. ప్రస్తుతం ఈ పేరు తనకు ఇష్టమైన పేరుగా మారిపోయింది అని..ఈ పాత్ర పై ప్రేక్షకులు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని తెలిపింది. ఇలా అభిమానుల ఆదరణను చూసి తన పేరును మార్చుకోవడంతో అభిమానులు కూడా ఈమె నిర్ణయం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి అయితే శివాని ఇప్పుడు తన పేరును మార్చుకొని కాత్యాయని ఆకుల గా మారిపోయింది మొత్తానికైతే ఒక్క సినిమా విజయంతో ఆ సినిమాలోని పాత్రని ఇప్పుడు తన పేరుగా మార్చుకున్న ఈమెకు మునుముందు ఎలాంటి అవకాశాలు లభిస్తాయో చూడాలి.
