Begin typing your search above and press return to search.

మ‌రో సూప‌ర్ హిట్ మూవీకి సీక్వెల్

రీసెంట్ టైమ్స్ లో ఏ సినిమా అయినా ప్రేక్ష‌కుల ముందుకొచ్చి సూప‌ర్ హిట్ అయిందంటే మేక‌ర్స్ ఆ సినిమాకు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ను అనౌన్స్ చేసేస్తున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   2 Oct 2025 1:29 PM IST
మ‌రో సూప‌ర్ హిట్ మూవీకి సీక్వెల్
X

రీసెంట్ టైమ్స్ లో ఏ సినిమా అయినా ప్రేక్ష‌కుల ముందుకొచ్చి సూప‌ర్ హిట్ అయిందంటే మేక‌ర్స్ ఆ సినిమాకు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ను అనౌన్స్ చేసేస్తున్నారు. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో ఎన్నో సినిమాలు సీక్వెల్, ప్రీక్వెల్ అంటూ సంద‌డి చేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ సీక్వెల్స్ లిస్ట్ లోకి మ‌రో హిట్ మూవీ జాయినైంది. అదే లిటిల్ హార్ట్స్. సాయి మార్తాండ్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిత్య హాస‌న్ నిర్మాత‌గా ఈ మూవీ తెర‌కెక్కింది.

ఘాటీ, మ‌ద‌రాసి పోటీని త‌ట్టుకుని మ‌రీ..

మౌళి త‌నూజ్, శివాని నాగారం జంట‌గా న‌టించిన లిటిల్ హార్ట్స్ సినిమా గ‌త నెల రిలీజై ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా చిన్న సినిమాగా వ‌చ్చిన ఈ మూవీ రిలీజ్ త‌ర్వాత భారీ క‌లెక్ష‌న్ల‌ను అందుకుంది. అంతేకాదు, ఈ సినిమాతో పాటూ అదే రోజున అనుష్క ఘాటీ, శివ కార్తికేయ‌న్ మ‌ద‌రాసి కూడా రిలీజ‌య్యాయి కానీ ఆ పోటీని త‌ట్టుకుని మ‌రీ లిటిల్ హార్ట్స్ ఎదురీది ఆడియ‌న్స్ మ‌న‌సుల్ని గెలుచుకుంది.

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు వ‌చ్చిన లిటిల్ హార్ట్స్

బాక్సాఫీస్ వ‌ద్ద మంచి స‌క్సెస్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వ‌చ్చేసింది. లిటిల్ హార్ట్స్ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ లో రాగా, ఈ మూవీలో కొన్ని ఎక్స్‌ట్రా సీన్స్ తో పాటూ ఓ భారీ స‌ర్‌ప్రైజ్ ను అనౌన్స్ చేశారు మేక‌ర్స్. లిటిల్ హార్ట్స్ మూవీకి సీక్వెల్ రాబోతున్న‌ట్టు అనౌన్స్ చేసిన మేక‌ర్స్, ఈ సినిమా క‌థాంశం ఏంటి? ఎప్ప‌టినుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌నేది మాత్రం వెల్ల‌డించలేదు.

క్రెడిబిలిటీని పోతుందేమోన‌ని ఆడియ‌న్స్ టెన్ష‌న్

విష‌యం తెలుసుకున్న ఆడియ‌న్స్ ఈ సీక్వెల్ పై భిన్న రీతిలో స్పందిస్తున్నారు. కొంద‌రు లిటిల్ హార్ట్స్ సినిమాకు సీక్వెల్ వ‌స్తుంద‌ని ఎగ్జైట్ అవుతుంటే మ‌రికొంద‌రు మాత్రం ఒక సినిమా హిట్టైతే వెంట‌నే దానికి సీక్వెల్ చేయాలా?సీక్వెల్ చేసి ముందు సినిమాకు ఉన్న క్రెడిబిలిటీని పోగొట్టాలా అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ మేక‌ర్స్ ఆల్రెడీ సీక్వెల్ ను అనౌన్స్ చేశారు కాబ‌ట్టి ఇక చేసేదేం లేదు. మ‌రి ఈ సీక్వెల్ కూడా లిటిల్ హార్ట్స్ లాగానే ఆడియ‌న్స్ ను మెప్పిస్తుందో లేదో చూడాలి.