Begin typing your search above and press return to search.

హౌస్ ఫుల్స్ పడుతుంటే.. ఓటీటీలోకి ఎందుకొస్తుంది?

థియేటర్లలో మూడో వీకెండ్ కూడా హౌస్ ఫుల్స్ పడుతుంటే ఇంత త్వరగా ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేస్తామంటూ ఆ సంస్థ రిటార్ట్ ఇచ్చింది.

By:  Garuda Media   |   20 Sept 2025 11:00 PM IST
హౌస్ ఫుల్స్ పడుతుంటే.. ఓటీటీలోకి ఎందుకొస్తుంది?
X

పెద్ద పెద్ద సినిమాలే నెల రోజులు పూర్తి కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. థియేటర్లలో రిలీజయ్యాక సరిగ్గా నాలుగు వారాల గడువుతో ఓటీటీలో స్ట్రీమ్ చేస్తున్నారు. గత నెలలో రిలీజైన ‘కూలీ’ని ఇలాగే డిజిటల్‌గా రిలీజ్ చేశారు. అలాంటపుడు కొత్త హీరో హీరోయిన్లు నటించిన ఓ చిన్న సినిమాకు నెల రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ ఉంటుందని ఆశించడం సహజం. ‘లిటిల్ హార్ట్స్’ సినిమా మీద ఇలాంటి ఆశలే పెట్టుకున్నారు ఓ వర్గం ప్రేక్షకులు.

థియేటర్లలో అద్భుత స్పందన తెచ్చుకుంటున్న ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఆ వర్గం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. సెప్టెంబరు 5న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. అక్కడ్నుంచి నాలుగు వారాల గ్యాప్ పెట్టుకుని అక్టోబరు 2న ఈ చిత్రాన్ని ఈటీవీ విన్‌లో డిజిటల్‌గా రిలీజ్ చేసేస్తున్నట్లు ఒక పోస్టర్ రెడీ చేసి వదిలారు సోషల్ మీడియాలో. ఆ పోస్టర్ చూసి అందరూ నిజమే అనుకున్నారు. కానీ ఈటీవీ విన్ ఎక్స్ హ్యాండిల్ నుంచి ఇది ఫేక్ అని పోస్ట్ పడింది.

థియేటర్లలో మూడో వీకెండ్ కూడా హౌస్ ఫుల్స్ పడుతుంటే ఇంత త్వరగా ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేస్తామంటూ ఆ సంస్థ రిటార్ట్ ఇచ్చింది. ‘‘ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే మీ ఫోన్ మీద ఒట్టే’’ అంటూ ‘లిటిల్ హార్ట్స్’ సినిమా స్టయిల్లోనే పోస్ట్ పెట్టింది. ఓటీటీ సంస్థలతో డీల్స్ మేరకు థియేటర్లలో ఆడుతున్న సినిమాలను కూడా కొన్ని సార్లు త్వరగా డిజిటల్‌గా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఐతే ‘లిటిల్ హార్ట్స్’కు ఆ ఇబ్బంది లేదు.

‘ఈటీవీ విన్’ సినిమా ప్రొడక్షన్లో కూడా భాగమైంది. అలాంటపుడు డిజిటల్‌గా రిలీజ్ చేయడంలో షరతులేమీ లేవు. థియేట్రికల్ రన్ అంతా పూర్తయ్యాక తాపీగానే ఓటీటీలో రిలీజ్ చేసుకునే అవకాశముంది. ఈ వీకెండ్లో కొత్త సినిమాల నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో ముందు వారాాల్లో వచ్చిన సినిమాలే బాక్సాఫీస్ దగ్గర ఆధిపత్యం చలాయిస్తున్నాయి. శని, ఆదివారాల్లో ‘లిటిల్ హార్ట్స్’కు ఫుల్స్ పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ‘లిటిల్ హార్ట్స్’ ఓటీటీలోకి రావడానికి కొంచెం ఎక్కువ సమయమే పట్టొచ్చు.