లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ రచ్చ.. మొదలైన ప్రాఫిట్స్!
టాలీవుడ్‌లో చిన్న సినిమాగా రిలీజ్ అయినా.. కంటెంట్‌తోనే విజయం సాధిస్తున్న మూవీ లిటిల్ హార్ట్స్. మొదటి రోజు లిమిటెడ్ స్క్రీన్స్‌లో ప్రారంభమైన ఈ సినిమా, ఎక్స్‌లెంట్ రివ్యూలతో బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది.
By: M Prashanth | 7 Sept 2025 4:10 PM ISTటాలీవుడ్‌లో చిన్న సినిమాగా రిలీజ్ అయినా.. కంటెంట్‌తోనే విజయం సాధిస్తున్న మూవీ లిటిల్ హార్ట్స్. మొదటి రోజు లిమిటెడ్ స్క్రీన్స్‌లో ప్రారంభమైన ఈ సినిమా, ఎక్స్‌లెంట్ రివ్యూలతో బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. నెమ్మదిగా మొదలైన ట్రెండ్ రెండో రోజుకి చేరేసరికి సెన్సేషనల్‌గా మారి, థియేటర్లలో మంచి రన్ చూపిస్తోంది.
రెండవ రోజు కలెక్షన్లు పెరిగి, వరల్డ్‌వైడ్‌గా సాలిడ్ షేర్ రాబట్టిన లిటిల్ హార్ట్స్ క్లీన్ హిట్‌గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో షోలు పెరిగిన తర్వాత ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం సినిమాకి బూస్ట్ ఇచ్చింది. ఓవర్సీస్‌లో కూడా సినిమాకి మంచి ఫీట్ లభించడంతో ట్రేడ్ వర్గాలు ఈ సినిమా లాంగ్ రన్‌లో మరింత లాభాలను తెస్తుందని చెబుతున్నాయి.
ఇక బాక్సాఫీస్ లెక్కలు చూస్తే, 2 రోజుల్లోనే సినిమా 2.27 కోట్ల షేర్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో 3.85 కోట్ల గ్రాస్ రాబట్టగా, ఓవర్సీస్, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మరో 1.40 కోట్లు దక్కించుకుంది. మొత్తంగా 2 రోజుల్లోనే 3.67 కోట్ల షేర్, 6.80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. మొదట బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్లు మాత్రమే ఉండగా, ఇప్పటికే ఆ మార్క్ దాటి, లాభాల జోన్‌లోకి ఎంటర్ అయ్యింది.
ఇంతవరకు ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. సినిమాకి ఇప్పటికీ 67 లక్షల వరకు ప్రాఫిట్ వచ్చిందని తెలుస్తోంది. ఈ లాభాలు కేవలం స్టార్టింగ్‌లోనే రావడం లిటిల్ హార్ట్స్ కు హ్యాపీ సైన్. రాబోయే రోజుల్లో హాలిడే అడ్వాంటేజ్, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా మరిన్ని కలెక్షన్లు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి.
చిన్న సినిమాగా రిలీజ్ అయినా, కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే ఎలాంటి రేంజ్‌లో కలెక్ట్ చేయగలదో లిటిల్ హార్ట్స్ ప్రూవ్ చేసింది. ఆడియన్స్‌లో సినిమా ఫ్యామిలీ అండ్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతోందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై పాజిటివ్ చర్చలు ఎక్కువగా రావడం, లాంగ్ రన్ రిజల్ట్స్‌కి బలాన్ని ఇస్తోంది. మొత్తానికి లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ దగ్గర కేవలం రెండు రోజుల్లోనే క్లీన్ హిట్‌గా నిలిచి, లాభాలను నమోదు చేసుకుంది. ఇక లాంగ్ రన్‌లో సినిమా ఏ స్థాయిలో ప్రాఫిట్స్ సాధిస్తుందో చూడాలి.
లిటిల్ హార్ట్స్ 2 డేస్ WW కలెక్షన్స్ రిపోర్ట్ (GSTతో సహా)
నైజాం: 0.95Cr
సీడెడ్: 22L
ఆంధ్ర: 1.10Cr
AP-TG మొత్తం:- 2.27CR (3.85CR గ్రాస్)
KA+ROI+OS: 1.40CR సుమారుగా
మొత్తం WW కలెక్షన్స్ – 3.67CR (6.80CR గ్రాస్)
