థియేటర్స్ లో రూ.30 కోట్లు.. OTTలో క్రింజ్ అంటారా?
ముఖ్యంగా.. మౌళి, శివానితోపాటు క్యాస్టింగ్ యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సాయి మార్తాండ్ మేకింగ్ అండ్ టేకింగ్ అదిరిపోయిందని చెబుతున్నారు.
By: M Prashanth | 7 Oct 2025 12:14 PM ISTచిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధించిన లిటిల్ హార్ట్స్ మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. 90స్ బయోపిక్ ఫేమ్ తనూజ్ మౌళి, అంబాజీ మ్యారేజ్ బ్యాండ్ ఫేమ్ శివాని నాగారం జంటగా సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఆ సినిమాను ఈటీవీ విన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆదిత్య హాసన్ నిర్మించారు.
కేవలం ఓటీటీ కోసమే నిర్మించిన ఆ సినిమా కంటెంట్ క్లిక్ అవుతుందనే నమ్మకం ఉండటంతో థియేటర్స్ లో సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ చేశారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల చేయగా.. ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పించి.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.
వివిధ రికార్డులు క్రియేట్ చేసిన ఆ సినిమా.. బడ్జెట్ కు అనేక రెట్ల లాభాలు సంపాదించింది. ఇప్పుడు ఓటీటీలో కూడా సందడి చేస్తోంది. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న లిటిల్ హార్ట్స్.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఓటీటీలోకి వచ్చిన నాలుగు రోజుల్లోనే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసింది. అతి తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ అందుకుంది.
ముఖ్యంగా.. మౌళి, శివానితోపాటు క్యాస్టింగ్ యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సాయి మార్తాండ్ మేకింగ్ అండ్ టేకింగ్ అదిరిపోయిందని చెబుతున్నారు. బెంగళూరు బ్యాక్ డ్రాప్ లో సాంగ్ కు బాగా కనెక్ట్ అయ్యామని అంటున్నారు. కానీ మరికొందరు మాత్రం లిటిల్ హార్ట్స్.. ఓవర్ రేటెడ్ మూవీ అని పోస్టులు పెడుతున్నారు.
క్రింజ్ సినిమా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే సూపర్ హిట్ చిత్రం జాతి రత్నాలు టైమ్ లో ఇలాంటి అభిప్రాయమే కొందరు వ్యక్తం చేశారు. కానీ ఓటీటీలో సినిమా దూసుకుపోయింది. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ మూవీ క్రింజ్ ఉన్న వాళ్లకు పలువురు నెటిజన్లు రిప్లైలు ఇస్తున్నారు. ఇలాంటి మూవీలు థియేటర్స్ లో చూస్తే వేరేలా ఉంటుందని చెబుతున్నారు.
జాతి రత్నాలు సినిమా ఓటీటీ దూకుడును గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ మూవీ కూడా అంతే విధంగా దూసుకుపోవడం పక్కా అని చెబుతున్నారు. థియేటర్స్ లోనే కాదు.. ఓటీటీలో కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అని అంటున్నారు. క్రింజ్ అంటూ కామెంట్లు ఉన్నప్పటికీ.. ఎక్కువ మంది ఓటీటీలో కురిపించిన ప్రశంసలను ఉదాహరిస్తున్నారు.
