Begin typing your search above and press return to search.

లిటిల్ హార్ట్స్.. ఓవర్సీస్ లెక్క ఎంతవరకు వచ్చిందంటే?

తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లో కూడా లిటిల్ హార్ట్స్ మూవీ దూసుకుపోతోంది. రిలీజ్ అయిన తొలి రోజు నుంచి ఓ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తోంది.

By:  M Prashanth   |   20 Sept 2025 3:52 PM IST
లిటిల్ హార్ట్స్.. ఓవర్సీస్ లెక్క ఎంతవరకు వచ్చిందంటే?
X

లిటిల్ హార్ట్స్.. కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఆ మూవీ కోసమే చర్చ నడుస్తోంది. చిన్న సినిమాగా విడుదలైన ఆ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా.. పెద్ద విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంటోంది. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టి.. సరికొత్త రికార్టులు నెలకొల్పుతోంది. ఎన్నో ఫీట్లను సాధిస్తోంది.


తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లో కూడా లిటిల్ హార్ట్స్ మూవీ దూసుకుపోతోంది. రిలీజ్ అయిన తొలి రోజు నుంచి ఓ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తోంది. నెవ్వర్ బిఫోర్ అనేలా సందడి చేస్తోంది. తాజాగా సినిమా అరుదైన ఘనతను అందుకుంది. నార్త్ అమెరికాలో వన్ మిలియన్ డాలర్స్ క్లబ్ లోకి చేరి లిటిల్ హార్ట్స్ ఔరా అనిపించింది.

మొత్తానికి ఒక ప్రతిష్టాత్మక మైలురాయిని అందుకుని.. అతిపెద్ద బ్లాక్‌ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలకు ఎల్లప్పుడూ తెలుగు డయాస్పోరా నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుందని నిరూపించింది. లిటిల్ హార్ట్స్ వంటి చిన్న సినిమాలు ఇప్పటి వరకు చాలా తక్కువగా వన్ మిలియన్ డాలర్ క్లబ్ ఫీట్ ను అందుకున్నాయి.

అదే సమయంలో ఇప్పటివరకు లిటిల్ హార్ట్స్ మూవీ ఇండియాలో రూ.24.90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ నుంచి రూ.9 కోట్లకు పైగా వరకు వసూలు చేసినట్లు సమాచారం. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ.34 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని.. రూ.30 కోట్ల లాభాన్ని అందుకుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కాగా సినిమా విషయానికొస్తే.. 90s మిడిల్ క్లాస్ బయోపిక్‌ సిరీస్ ఫేమ్ మౌళి తనుజ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీ ఫేమ్ శివాని నాగారం లీడ్ రోల్స్ లో నటించారు. రాజీవ్ కనకాల, నరేష్, వాసుకి, సత్య కృష్ణన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యంగ్ డైరెక్టర్ సాయి మార్తాండ్ సినిమాకు దర్శకత్వం వహించారు.

90s మిడిల్ క్లాస్ బయోపిక్‌ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఆయన రూపొందించగా.. ప్రముఖ డిస్టిబ్యూటర్లు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేశారు. వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ చేశారు. భారీ హిట్ ను సొంతం చేసుకున్నారు. పెద్ద ఎత్తున ప్రాఫిట్స్ అందుకుంటున్నారు.