Begin typing your search above and press return to search.

అత‌న్ని స‌రిగ్గా గుర్తించ‌ట్లేదే!

యాక్ట‌ర్ అన్న త‌ర్వాత ఎంత చిన్న పాత్రలో న‌టించినా స‌రే త‌మ పాత్ర‌కు గుర్తింపు రావాల‌ని కోరుకోవ‌డం కామ‌న్.

By:  Sravani Lakshmi Srungarapu   |   10 Sept 2025 12:00 PM IST
అత‌న్ని స‌రిగ్గా గుర్తించ‌ట్లేదే!
X

సినీ రంగంలో ఎవ‌రికెప్పుడు ఎలాంటి గుర్తింపు వ‌స్తుందో చెప్ప‌లేం. కొంత మంది టాలెంట్ మొద‌టి అవ‌కాశంతోనే అంద‌రూ గుర్తిస్తే ఇంకొంత మంది మాత్రం ఆ గుర్తింపు కోసం ఎంతో కాలం వేచి చూడాల్సి ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ టాలెంట్ తో స‌త్తా చాటుతున్నా అదృష్టం క‌లిసిరాక వారికి రావాల్సిన గుర్తింపు రాదు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన చాలా మంది ఈ ప్రాబ్ల‌మ్ ను ఫేస్ చేస్తుంటారు.

యాక్ట‌ర్ అన్న త‌ర్వాత ఎంత చిన్న పాత్రలో న‌టించినా స‌రే త‌మ పాత్ర‌కు గుర్తింపు రావాల‌ని కోరుకోవ‌డం కామ‌న్. అయితే కోరుకున్న ప్ర‌తీ పాత్రా గుర్తింపు అందుకోలేదు. రీసెంట్ గా టాలీవుడ్ లో రిలీజైన లిటిల్ హార్ట్స్ సినిమాకు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సినిమా గురించి కేవ‌లం సాధార‌ణ ఆడియ‌న్స్ మాత్ర‌మే కాకుండా సెల‌బ్రిటీలు కూడా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న లిటిల్ హార్ట్స్ టీమ్

అయితే లిటిల్ హార్ట్స్ సినిమా గురించి వ‌స్తున్న ప్ర‌తీ ప్ర‌శంస‌కూ సినిమాలో వ‌ర్క్ చేసిన ప్ర‌తీ ఒక్క‌రూ అర్హులే. లీడ్ రోల్ లో న‌టించిన మౌళి నుంచి డైరెక్ట‌ర్ సాయి మార్తాండ్, ఇత‌ర టీమ్ మొత్తం ఈ స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కాగా లిటిల్ హార్ట్స్ సినిమాలో మంచి క్యారెక్ట‌ర్ చేసిన‌ప్ప‌టికీ త‌న పాత్ర‌కు రావాల్సినంత‌ గుర్తింపు రాని న‌టుడు జై కృష్ణ‌.

మౌళితో స‌మానంగా స్క్రీన్ టైమ్

లిటిల్ హార్ట్స్ లో హీరో ఫ్రెండ్ గా క‌నిపించిన జై కృష్ణ సినిమా మొత్తం మౌళితో ఈక్వ‌ల్ గా స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. ఆన్ స్క్రీన్ లో వారిద్ద‌రి కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. సినిమాలో మౌళి, జై కృష్ణ కాంబినేష‌న్ చాలా కాలం వ‌ర‌కు గుర్తుండిపోతుంది. లిటిల్ హార్ట్స్ లో జై క్యారెక్ట‌రైజేష‌న్ ను డెవ‌ల‌ప్ చేసిన విధానం, ప్ర‌తీ సీన్ లోనూ అత‌ను కామెడీని పండించిన వైనం చాలా హుందాగా ఉంది.

గ‌తంలో ఉప్పెన సినిమాలో న‌టించిన జై

అంతేకాదు, సినిమా మొత్తంలో అత‌ని ఎక్స్‌ప్రెష‌న్స్, డైలాగ్ డెలివ‌రీ, అత‌ని భాష, సినిమా మొత్తం హీరోకు అత‌నిచ్చిన స‌పోర్ట్ చాలా బావున్నాయి. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే లిటిల్ హార్ట్స్ కు జై కృష్ణ సెకండ్ హీరో. సినిమాలో అత‌ని రోల్ బావుందంటున్నారు త‌ప్పించి అత‌నికి రావాల్సిన గుర్తింపు మాత్రం ఇంకా ద‌క్క‌లేద‌నే చెప్పాలి. గ‌తంలో జై కృష్ణ ఉప్పెన సినిమాలో కూడా యాక్ట్ చేశారు. దాని కంటే ముందు ప‌లు షార్ట్ ఫిల్మ్స్ తో పాటూ మౌళితో క‌లిసి చాలా ప్రాజెక్టుల్లో వ‌ర్క్ చేశారు. మ‌రి లిటిల్ హార్ట్స్ సినిమా త‌ర్వాత అయినా జై కు మ‌రిన్ని అవ‌కాశాలొస్తాయేమో చూడాలి.