Begin typing your search above and press return to search.

ఏంటీ.. తారక్ తో లిటిల్ హార్ట్స్ బ్యూటీకి రిలేషనా.. ఆమె మాటల్లోనే!

తన నటనతో, అందంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న పద్మిని సెట్టం కూడా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ తో తనకున్న రిలేషన్ గురించి కూడా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

By:  Madhu Reddy   |   11 Sept 2025 8:00 PM IST
ఏంటీ.. తారక్ తో లిటిల్ హార్ట్స్ బ్యూటీకి రిలేషనా.. ఆమె మాటల్లోనే!
X

లిటిల్ హార్ట్స్.. చిన్న సినిమాగా వచ్చి అటు అనుష్క 'ఘాటీ' ఇటు శివ కార్తికేయన్ 'మదరాసి' చిత్రాలకు పోటీగా నిలిచి సంచలనం సృష్టించింది. రెండు బడా చిత్రాలను వెనక్కి నెట్టి కలెక్షన్ల పరంగా.. కథ, కంటెంట్ పరంగా ఆడియన్స్ హృదయాలను దోచుకుంది ఈ సినిమా. ఇందులో నటించిన నటీనటులకు కూడా మంచి గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నటీనటులు కూడా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో తెలియని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో తన నటనతో, అందంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న పద్మిని సెట్టం కూడా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ తో తనకున్న రిలేషన్ గురించి కూడా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఒక ఇంటర్వ్యూలో భాగంగా పద్మిని సెట్టం మాట్లాడుతూ.. "ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా 'బాల రామాయణం' సినిమాలో నటిస్తున్నప్పుడే ఆ సినిమా షూటింగ్ కి నేను నా గ్రాండ్ పేరెంట్స్ తో కలిసి వెళ్లేదాన్నట. పైగా వాళ్లు మా ఏరియాలోనే ఉండేవారట. అలా బాల రామాయణం షూటింగ్ జరిగినప్పుడు..నా వయసు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే. ఈ విషయం నాకు పెద్దగా గుర్తులేదు కానీ నా గ్రాండ్ పేరెంట్స్ నేను ఎన్టీఆర్ అన్న దగ్గరకు వెళ్ళినప్పుడు అన్నా అన్నా అని ఆయనతో చాలా బాగా మాట్లాడేదాన్నట.. అన్నతో పరిచయం ఏర్పడ్డాక.. అన్న ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా అని నేను ఆయన ఇంటి ముందు సైకిల్ వేసుకొని తిరిగేదాన్ని. కానీ రాఖీ సినిమా హిట్ అయిన తర్వాత ఆయన ఒక్కసారి మాత్రమే ఆడియన్స్ కి ముందుకు వచ్చి హాయ్ చెప్పడంతో అప్పుడు నేను తెగ ఎగ్జైట్ అయిపోయాను" అంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

అప్పట్లో స్పోర్ట్స్ బైక్ అంటే చాలా తక్కువ.. దానిని మా కాలనీలో ఎన్టీఆర్ అన్న ఉపయోగించేవారు.. అలా ఎప్పుడైతే మా వీధిలో స్పోర్ట్స్ బైక్ వెళ్ళింది అంటే.. ఇక అన్న అని నేను ఫిక్స్ అయిపోయి వెంటనే మా ఇంటి బాల్కనీకి పరిగెత్తి మరీ చూసేదాన్ని. కానీ ఆయన హెల్మెట్ మొత్తం పెట్టుకోవడం వల్ల పెద్దగా తెలిసేది కాదు. అలా ఆ అభిమానంతోనే తెలిసిన వాళ్ల సహాయంతో 2017లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన "జై లవకుశ" సినిమా షూటింగ్ కి వెళ్లాను. అక్కడికైతే వెళ్లాను కానీ అన్న ఎదురుగా రావడంతో ఇక భయపడి మాట్లాడలేదు.

ఆయన చాలా స్వీట్గా వచ్చి హాయ్ అమ్మ అంటూ పలకరించడంతో.. ఎక్కలేని సంతోషం వచ్చేసింది. అయితే అప్పటికి ఇంకా నేను ఫిలిమ్స్ లోకి రాలేదు. సాఫ్ట్వేర్ గా ఉద్యోగం చేసేదాన్ని. ఇక ఈ విషయాన్ని నేను అన్నతో చెప్పాను. ఇలా ఇన్ఫోసిస్ లో చేస్తున్నాను. కానీ మీ ఇన్స్పిరేషన్ తోని నేను ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నాను అని చెప్పాను. అలాగే చిన్ననాటి విషయాలను కూడా ఆయనకు గుర్తు చేశాను.ఇలా చిన్నప్పుడు మీరు మా ఏరియా లోనే ఉండే వాళ్ళు అని.. నేను మిమ్మల్ని ఒకసారి కలిశానట కూడా అంటూ చెప్పాను. ఇక ఆయన చాలా స్వీట్ గా నాతో మాట్లాడేసరికి ఆ వైబ్రేషన్స్ ని ఇప్పటికే మర్చిపోలేకపోతున్నాను" అంటూ తెలిపింది పద్మిని. అలా తన కాలనీలో ఉంటూనే అన్నయ్య అని ఆయన వెంటే తిరుగుతూ ఉండే దాన్నట అంటూ తమ మధ్య రిలేషన్ గురించి చెప్పుకొచ్చింది పద్మిని. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.