Begin typing your search above and press return to search.

లిటిల్ హార్ట్స్ మౌళి.. రెమ్యునరేషన్ పెరిగిందా?

ముఖ్యంగా హీరోగా నటించిన మౌలిపై ప్రొడ్యూసర్లు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

By:  M Prashanth   |   13 Oct 2025 4:30 PM IST
లిటిల్ హార్ట్స్ మౌళి.. రెమ్యునరేషన్ పెరిగిందా?
X

ఒక్క సినిమా చాలు ఇండస్ట్రీలో బిజీ అయిపోవడానికి. అదే ఒక్క సినిమా చాలు మనకు కావాల్సినంత క్రేజ్ రావడానికి. అలా మూవీటీమ్ మొత్తానికి అనుకున్న దాని కంటే ఎక్కువే క్రేజ్ తీసుకొచ్చిన లేటెస్ట్ సినిమా లిటిల్ హార్ట్స్. చిన్న సినిమాగా తెరకెక్కి అంచనాలు లేకుండానే థియేటర్లలోకి వచ్చిందీ సినిమా. అంతే.. ఇక ఫస్ట్ షో పడిన తర్వాత సినిమా దశ మారిపోయింది. సూపర్ హిట్ టాక్ తో భారీ వసూళ్లతో అదరగొట్టింది.

ఈ దెబ్బతో మూవీ టీమ్ లోని కొందరు గారెల బుట్టెలో పడ్డట్లు అయ్యింది. యూట్యూబ్ స్టార్ మౌలి తనుజ్ హీరోగా సాయి మార్తాండ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న రిలీజైంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం మంచి విజయం దక్కించుకుంది. మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలు సైతం ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ సినిమా బృందం ఫేట్ మారిపోయింది.

ముఖ్యంగా హీరోగా నటించిన మౌలిపై ప్రొడ్యూసర్లు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తన డేట్స్ కోసం ఇప్పట్నుంచే నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయట. దీంతో అతడు చాలా బిజీ అయిపోయాడు. రీసెంట్ గా తెలుగులో బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మౌలికి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకున్నట్లు తెలిసింది. అయితే అతడి రెమ్యూనరేషన్ ఎంత అనుకుంటున్నారు? అక్షరాలా కోటి రూపాయలు ఇచ్చి మైత్రి మౌలితో అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే తన తొలి సినిమా లిటిల్ హార్ట్స్ కు మౌలి రూ.5 నుంచి 10 లక్షల లోపే తీసుకొని ఉంటాడు. ఈ లెక్కన ఇప్పుడు కోటి రూపాయలు అంటే ఏకంగా పదింతలు హైక్. దీంతో మౌలి జాతకమో మారిపోయిందని చెప్పాలి. అయితే రెండో సినిమాకు డైరెక్టర్ ఎవరో ఇంకా కన్ఫార్మ్ కాలేదు. కానీ, మైత్రి అతడిని లాక్ చేసేసింది. ఎవరైనా మంచి కథతో వస్తే తీసేందుకు రెడీగా ఉంది. వీళ్లతోపాటు మౌలి ఇంకో రెండు, మూడు నిర్మాణ సంస్థలతో కూడా టచ్ లో ఉన్నాడట!

ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మౌలి పారితోషికం గురించే. రెండో సినిమాకే పదింతలు హైక్ రావడం మామూలు విషయం కాదు. ఇక ఒకసారి కోటి రూపాయలు అందుకున్నాడంటే.. ఇక అతడి రెమ్యూనరేషన్ కోటి అని ఫిక్స్ అయిపోయినట్లే. ఇకపై చేసే సినిమాలకు కోటి లేదా అంతకంటే ఎక్కువే తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే లిటిల్ హార్ట్స్ తర్వాత రెండో సినిమా ఫిక్స్ కాలేదు. మైత్రి వాళ్లతో అగ్రిమెంట్ అయ్యింది కాబట్టి.. అదే బ్యానర్ లో నెక్స్ట్ సినిమా ఉండే ఛాన్స్ ఉంటుంది.