కొత్త ఆశలు రేకెత్తిస్తున్న లిటిల్ హార్ట్స్
90స్ వెబ్ సిరీస్ తో సూపర్ క్రేజ్ ను తెచ్చుకున్న మౌళి తాజాగా ఓ రొమాంటిక్ కామెడీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
By: Sravani Lakshmi Srungarapu | 6 Sept 2025 3:54 PM IST90స్ వెబ్ సిరీస్ తో సూపర్ క్రేజ్ ను తెచ్చుకున్న మౌళి తాజాగా ఓ రొమాంటిక్ కామెడీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సెప్టెంబర్ 5న రిలీజైన లిటిల్ హార్ట్స్ సినిమాపై ముందు నుంచి మంచి బజ్ నెలకొంది. ఆ బజ్ కు తగ్గట్టే సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ దిశగా దూసుకెళ్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ సినిమా బాగా రన్ అవుతోంది.
యూఎస్ లో $75000 డాలర్లు కలెక్ట్ చేసిన లిటిల్ హార్ట్స్
అందులో భాగంగానే లిటిల్ హార్ట్స్ తన ఓవర్సీస్ జర్నీని ఇంప్రెస్సివ్ నోట్ తో స్టార్ట్ చేసింది. యునైటైడ్ స్టేట్స్ లో ఈ సినిమా డే1 చాలా స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేసింది. యూఎస్ లో లిటిల్ హార్ట్స్ కేవలం 65 లొకేషన్లలోనే రిలీజైనప్పటికీ, ఈ మూవీ మొదటి రోజున 75,000 డాలర్లను వసూలు చేసి చిత్ర యూనిట్ కు ఎంతో బూస్టప్ ను అందించడంతో పాటూ మరిన్ని చిన్న సినిమాలకు కొత్త ఆశలను రేకెత్తించింది.
చిన్న విషయమేమీ కాదు
మౌళి లాంటి హీరోకు మొదటి రోజునే ఈ రేంజ్ కలెక్షన్లు రావడమంటే చిన్న విషయమేమీ కాదు. ఓవర్సీస్ లో లిటిల్ హార్ట్స్ ను లిమిటెడ్ లొకేషన్లలోనే రిలీజ్ చేసినప్పటికీ రిలీజైన ప్రతీ చోటా మంచి ఆక్యుపెన్సీలతో సినిమా సక్సెస్‌ఫుల్ గా దూసుకెళ్తోంది. ఓవర్సీస్ లోని తెలుగు ఆడియన్స్ లో ఏర్పడిన సంచలనమే ఈ కలెక్షన్లకు కారణమని ట్రేడ్ పండితులు నొక్కి మరీ చెప్తున్నారు.
అందరి దృష్టి వీకెండ్ కలెక్షన్లపైనే
ఎలాగూ లిటిల్ హార్ట్స్ కు మంచి మౌత్ టాక్ వచ్చింది కాబట్టి ఈ వీకెండ్ కలెక్షన్లు ఇంకా బెటర్ గా ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇప్పుడందరి దృష్టి లిటిల్ హార్ట్స్ వీకెండ్ కలెక్షన్లపై ఉంది. లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలకు ఆడియన్స్ నుంచి ఆదరణ దక్కితే ఇదే తరహాలో మరిన్ని సినిమాలు కొత్త రికార్డులను క్రియేట్ చేసే ఛాన్సుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
