Begin typing your search above and press return to search.

ఆ క్లబ్ లోకి లిటిల్ హార్ట్స్?.. 6వ రోజు ఎంత వసూలు చేసిందంటే?

ఆయన వంశీ నందిపాటితో కలిసి సినిమాను రూ.2 కోట్లకు కొనుగోలు చేసి రిలీజ్ చేశారు.

By:  M Prashanth   |   11 Sept 2025 1:20 PM IST
ఆ క్లబ్ లోకి లిటిల్ హార్ట్స్?.. 6వ రోజు ఎంత వసూలు చేసిందంటే?
X

లిటిల్ హార్ట్స్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ సినిమా కోసమే డిస్కస్ చేసుకుంటున్నారు. చిన్న మూవీగా విడుదల పెద్ద విజయం సాధించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ అవ్వగా.. ఫస్ట్ షో నుంచి కూడా పాజిటివ్ టాక్ తో సందడి చేస్తోంది. భారీ వసూళ్లను రాబడుతోంది.

90s బయోపిక్ ఫేమ్ మౌళి తనూజ్ హీరోగా నటించిన ఆ సినిమాలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫేమ్ శివాని నాగరం హీరోయిన్ గా యాక్ట్ చేసింది. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా.. 90s బయోపిక్ దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ పై నిర్మించారు.

మొదటగా ఈటీవీ విన్‌లో రిలీజ్ చేయాలనుకున్న ఆ సినిమాను.. ఫైనల్ అవుట్‌పుట్ చూసిన నిర్మాత బన్నీ వాస్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన వంశీ నందిపాటితో కలిసి సినిమాను రూ.2 కోట్లకు కొనుగోలు చేసి రిలీజ్ చేశారు. అయితే రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం, మూడో రోజే లాభాల్లోకి వెళ్లడం విశేషం.

ఇప్పుడు రిలీజ్ అయ్యి వారం రోజులు కావొస్తున్నా అదే స్పీడ్ లో వెళ్తోంది.. యూత్ మైండ్‌ సెట్‌ కు దగ్గరగా ఉన్న కథ కావడంతో ఓ రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంటోంది. ఇప్పుడు ఆరో రోజు కూడా భారీ వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా బుధవారం లిటిల్ హార్ట్స్ మూవీ రూ.2.75 కోట్ల గ్రాస్ ను రాబట్టి ఆశ్చర్చపరిచింది.

ఇండియాలో 1153 షోస్ వేయగా.. రూ.1.93 కోట్లు సాధించింది. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా లిటిల్ హార్ట్స్ మూవీ రూ.21 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో మరికొన్ని రోజుల్లో రూ.25 కోట్ల క్లబ్ లోకి సినిమా అడుగు పెట్టనున్నట్లు సమాచారం. ఈ వీకెండ్ కల్లా ఆ ఫీట్ అందుకునేలా కనిపిస్తోంది.

అయితే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఆ సినిమా ఫస్ట్ డే రూ.1.35 కోట్లు రాబ‌ట్టింది. తర్వాత రోజు రెట్టింపు కలెక్షన్లు సాధించింది. మూడో రోజు ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసింది. ఫస్ట్ వీకెండ్ కే భారీ నెంబర్ ను నమోదు చేసింది. వర్కింగ్ డేస్ లో కూడా స్టడీగా కలెక్షన్లు రాబడుతోంది. కాబట్టి మరికొన్ని రోజుల పాటు లిటిల్ హార్ట్స్ పెద్ద ఎత్తున రాబట్టనుందని చెప్పాలి.