Begin typing your search above and press return to search.

టాప్ ప్లేస్ 'లిటిల్' హార్ట్స్ దే.. భారీ లాభాలతో దూకుడు..

రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని.. మూడో రోజు లాభాల్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు రిలీజ్ అయ్యి వారం రోజులు కావొస్తున్నా కూడా అదే దూకుడు కొనసాగిస్తోంది.

By:  M Prashanth   |   11 Sept 2025 11:06 AM IST
టాప్ ప్లేస్ లిటిల్ హార్ట్స్ దే.. భారీ లాభాలతో దూకుడు..
X

సూపర్ హిట్ 90s మిడిల్ క్లాస్ బయోపిక్‌ సిరీస్ ఫేమ్ మౌళి తనుజ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హీరోయిన్ శివాని నాగారం జంటగా నటించిన మూవీ లిటిల్ హార్ట్స్. రొమాంటిక్ డ్రామాగా సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌ పై ఆదిత్య హాసన్ రూపొందించారు.

రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనితా చౌదరి, సత్య కృష్ణన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఆ సినిమాను బన్నీ వాస్.. బీవీ వర్క్స్, వంశీ నందిపాటి.. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌ పై వరల్డ్ వైడ్ గ్రాండ్‌ గా రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 5వ తేదీన సినిమా విడుదలవ్వగా.. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంది.

అందరినీ ఆకట్టుకుంటా చిన్ని సినిమాగా విడుదలై భారీ విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్ లో వసూళ్లు సాధిస్తోంది. రూ.2 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా.. ఇప్పుడు అనేక రెట్లు లాభాలు తెచ్చి పెడుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాలతోపాటు వరల్డ్ వైడ్ గా కూడా మంచి హిట్ గా నిలిచి అదరగొడుతోంది.

రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని.. మూడో రోజు లాభాల్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు రిలీజ్ అయ్యి వారం రోజులు కావొస్తున్నా కూడా అదే దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రూ.18.50 కోట్లకుపైగా గ్రాస్ వసూల్ చేసినట్లు తెలుస్తోంది. ఆరో రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం.

ఇప్పటి వరకు రూ.13 కోట్లకు పైగా గ్రాస్ లాభాలు అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. తద్వారా 2025లో అత్యంత లాభదాయకమైన తెలుగు చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన కోర్ట్ తోపాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను కూడా అధిగమించింది. మరిన్ని వసూళ్లను సాధించేలా స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే ఓవర్సీస్ లో లిటిల్ హార్ట్స్ మూవీ తొలి మంగళవారం $100K దాటేసింది. తెలుగు సినిమాల్లో అక్కడ సంక్రాంతికి వస్తున్నాం, కోర్ట్ మూవీల తర్వాత హైయ్యెస్ట్ మంగళవారం వసూళ్లుగా ఆ నెంబర్ నిలిచింది. ఇదే ట్రెండ్ కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రతిష్టాత్మకమైన $1 మిలియన్ మైలురాయిని చేరుకునే అవకాశం కూడా ఉంది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.