Begin typing your search above and press return to search.

పూజా హెగ్డేకే చెమ‌ట‌లు ప‌ట్టించిన బుడ్డోడు

అదంతా ఒకెత్తు అనుకుంటే ఇప్పుడు పూజా హెగ్డే ముందే ఒక బుడ‌త‌డు వేసిన స్టెప్పులు ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌గా మారాయి.

By:  Sivaji Kontham   |   8 Feb 2026 11:46 AM IST
పూజా హెగ్డేకే చెమ‌ట‌లు ప‌ట్టించిన బుడ్డోడు
X

లోకేష్ క‌న‌గ‌రాజ్ `కూలీ` చిత్రంలో `మోనిక..` పాట ఎంత పెద్ద సక్సెసైందో తెలిసిందే. ఈ పాట‌లో క‌మెడియ‌న్ సౌబిర్ షాహిన్ డ్యాన్సుల‌కు మంచి మార్కులేసిన జ‌నం, పూజా హెగ్డే ని మించి అత‌డు డ్యాన్సులు చేసాడంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. సౌత్ లో బెస్ట్ డ్యాన్సింగ్ హీరోయిన్ గా గుర్తింపు ఉన్న పూజానే అత‌డు డామినేట్ చేయ‌డంపై అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసారు. ఈ పాట‌పై చాలా కాలం పాటు చ‌ర్చ సాగింది. అంతేకాదు.. మోనిక‌.. ఓ మై డార్లింగ్ పాట‌ను అనుక‌రిస్తూ చాలా వీడియోలు, డ్యాన్స్ ప్రాక్టీస్ క్లిప్ లు ఇంట‌ర్నెట్ ని షేక్ చేసాయి.

అదంతా ఒకెత్తు అనుకుంటే ఇప్పుడు పూజా హెగ్డే ముందే ఒక బుడ‌త‌డు వేసిన స్టెప్పులు ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌గా మారాయి. ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోలో, అందాల క‌థానాయిక పూజా ఆ బుడ్డోడితోను డ్యాన్సుల్ని మ్యాచ్ చేయ‌లేక‌పోయింది..బాలుడి స్టెప్పుల‌ను మైమ‌రిచిపోయి చూస్తున్న పూజా హెగ్డేపై ర‌క‌ర‌కాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎక్స్ ఖాతా స‌హా సోష‌ల్ మీడియాలో బుడ్డోడి డ్యాన్సుల వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారుతోంది. ఆ చిన్నారి వేసిన స్టెప్పులకు బుట్టబొమ్మ సైతం ఫిదా అయిపోయింది.

ఎవరీ బుడ్డోడు?

ఎవ‌రు ఈ బుడ్డోడు? అంటే కాస్త‌ వివ‌రాల్లోకి వెళ్లాలి. ఈ బుడ్డోడి పేరు లితీష్. చెన్నైకి చెందిన మెగా డాన్సర్. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పాటలకు తనదైన స్టైల్‌లో సిగ్నేచర్ స్టెప్పులు వేస్తూ `వైరల్ కిడ్`గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ వీడియో ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? అంటే... కూలీ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ సమయంలో ఈ డాన్స్ వీడియోని షూట్ చేసిన‌ట్టు స‌మాచారం.

నిజానికి మోనిక సాంగ్‌కు లితీష్ వేసిన స్టెప్పుల్లో గ్రేస్, ఎనర్జీ చూసి పూజా హెగ్డే ఆశ్చర్యపోయింది. సాధారణంగా పూజా తన డాన్స్ ల్లో గ్రేస్‌తో అందరినీ మెప్పిస్తుంది. కానీ ఈ వీడియోలో ఆ బుడ్డోడి బాడీ లాంగ్వేజ్- హై స్పీడ్ చూసి మైమరిచిపోయింది. ఈ వీడియో వీక్షించాక‌, నెటిజన్లు కూడా `పూజాకే చెమటలు పట్టించాడు ఈ బుడ్డోడు` అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా విత్ ఏబీ -ఎక్స్ ఖాతా ఈ వీడియోను షేర్ చేయడంతో లక్షలాది వ్యూస్ సాధించింది. ముఖ్యంగా ఆ చిన్నారిలో ఉన్న కాన్ఫిడెన్స్ ని గ‌మ‌నిస్తే, పెద్ద స్టార్స్ ముందు కూడా తడబడకుండా తన టాలెంట్ చూపించడం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. పూజా హెగ్డే ఆ చిన్నారిని ప్రోత్సహిస్తూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ అరుదైన‌ డ్యాన్సింగ్ వీడియో వీక్షించిన నెటిజ‌నులు ఈ బుడ్డోడికి చెన్నై ప‌రిశ్ర‌మ‌లో చాలా మంచి అవ‌కాశాలొస్తాయ‌ని, కోలీవుడ్ లో ద‌ళ‌ప‌తి త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థానం ఈ బుడ్డోడికే ద‌క్కాల‌ని కూడా ఆకాంక్షిస్తున్నారు. నిజం చెప్పాలంటే ద‌ళ‌ప‌తి వార‌సుడు జోసెఫ్ విజ‌య్ డైరెక్ష‌న్‌లోకి వెళుతుంటే, ఈ బుడ్డోడే అతడికి వార‌సుడిగా వ‌స్తాడు! అంటూ ఒక సెక్ష‌న్ స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తోంది.