మళ్లీ ట్రెండింగ్‌లో పాత బూతు సినిమా...!
లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా సినిమా థియేటర్ లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. అయితే ఓటీటీలో మాత్రం సినిమాకు మంచి వ్యూస్ లభించాయి.
By: Ramesh Palla | 18 Nov 2025 1:05 PM ISTసెన్సార్ బోర్డ్‌ను సవాల్ చేసి 2017లో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ఉమందుకు వచ్చిన ఎ రేటెడ్ మూవీ 'లిప్‌స్టిక్ అండర్ మై బుర్జా'. ఈ సినిమా విడుదల సమయంలో కాస్త హడావిడి నడిచింది. థియేటర్‌లో విడుదల కావడం సాధ్యం కాకపోవచ్చు అని ఆ సమయంలో చాలా మంది అన్నారు. సినిమాలో సెన్సిబుల్ కంటెంట్ ఎక్కువగా ఉంది, అందుకే ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయడం సాధ్యం కాకపోవచ్చు అని చాలా మంది భావించారు. కానీ చిత్ర యూనిట్ సభ్యులు సెన్సార్ బోర్డ్ తో పోరాటం చేసి మరీ సినిమాను థియేట్రికల్ రిలీజ్ అయ్యే విధంగా చేశారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలకు ఎదురైన ఇబ్బందులు ఆ సమయంలో జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. ఒక సినిమా సెన్సార్ గురించి ఆ స్థాయిలో చర్చ జరగడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సోషల్ మీడియాలోనూ ఆ సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరిగింది.
ఓటీటీలో లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా...
లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా సినిమా థియేటర్ లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. అయితే ఓటీటీలో మాత్రం సినిమాకు మంచి వ్యూస్ లభించాయి. అమెజాన్ ప్రైమ్ లో సినిమా స్ట్రీమింగ్ అయింది. ప్రస్తుతం సినిమాను అమెజాన్ ప్రైమ్ ఉచితంగానే అందుబాటులో ఉంచింది. ఇప్పుడు మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేయడం కోసం జియో హాట్ స్టార్ లోకి ఈ సినిమా వచ్చేసింది. కొత్తగా ఈ సినిమాను జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ చేస్తుండటంతో మళ్లీ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా గురించి మళ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొందరు కొత్త ప్రేక్షకులు ఇప్పుడు సినిమాను చూసి, కొత్త ఫీల్ ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రొమాంటిక్ డ్రామాను ఏడు ఏళ్ల తర్వాత కూడా ప్రేక్షకులు ఆస్వాదించడం ఆశ్చర్యంగా ఉందని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ రాస్తున్నారు.
జియో హాట్ స్టార్‌లో లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా మూవీ...
అలంకార శ్రీవాస్తవ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ప్రకాష్ ఝూ నిర్మించారు. నిర్మాతగా ఆయనకు ఈ సినిమా అప్పుడు కాస్త ఇబ్బంది పెట్టినా ఇప్పుడు డబ్బులు తెచ్చి పెడుతోందని అంటారు. ఈ సినిమాలో రత్న పాఠక్, కొంకన సేన్ శర్మ, అహానా కుమ్రా, ప్లాబితా బోర్తాకూర్, సుశాంత్ సింగ్, సోనాల్ ఝూ, విక్రాంత్ మాస్సే, శశాంక్ అరోరా, వైభవ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. జీవితంలో ఒత్తిడితో నలిగి పోయే ఆడవారు కొత్త జీవితం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారు అనేది ఈ సినిమా కథాంశం. ఆ నలుగురు స్వేచ్చే జీవితంలో అడుగు పెట్టడం కోసం చేసే ప్రయత్నాలు, ఆ తర్వాత జరిగే సంఘటనలు ఈ సినిమాలో చూపించారు. శృతి మించిన రొమాంటిక్ సీన్స్ తో పాటు, బూతు డైలాగ్స్, ఇబ్బంది పెట్టే విధంగా అశ్లీల సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కి దూరంగా ఉంటే, యూత్ ను మాత్రం ఆకర్షిస్తోంది.
ఓటీటీలో కొత్తగా ట్రెండ్ అవుతున్న మూవీ..
ఈ బూతు సినిమా ఇప్పుడు జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉండటంతో మరింత మంది ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది. గతంలో చూసిన వారు మాత్రమే కాకుండా కొత్త వారు సైతం మళ్లీ జియో హాట్ స్టార్ ద్వారా ఈ సినిమాను చూస్తారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అమెజాన్ తో పోల్చితే జియో హాట్ స్టార్ కి ఎక్కువగా ప్రేక్షకుల రీచ్ ఉంటుంది. పైగా సినిమా గురించి మరోసారి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది అంటూ వార్తలు వస్తున్న కారణంగా మరోసారి ఈ సినిమా సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా కొత్త సినిమాల రేంజ్ లో జియో హాట్ స్టార్‌లో కూడా ట్రెండ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటూ నెటిజన్స్, సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జియో హాట్ స్టార్ లో ఈ సినిమాకు అత్యధిక వ్యూస్ వచ్చినా ఆశ్చర్యం లేదు.
