రియల్ లైఫ్ లో కాలు జారిన హీరో-హీరోయిన్లు!
శంషాబాద్ సమీపంలో జరుగుతుండగా, షూటింగ్ లో భాగంగా చిత్ర యూనిట్ ఓ భారీ వాటర్ ట్యాంక్ ను నిర్మించగా, ఆ ట్యాంక్ ఒక్కసారిగా కూలిపోవడంతో చిత్ర యూనిట్ లోని టెక్నికల్ టీమ్ గాయపడింది.
By: Srikanth Kontham | 3 Nov 2025 5:00 PM ISTఆన్ సెట్స్ లో అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు, ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అవి కొన్ని భారీ ప్రమాదాలు కావొచ్చు..చిన్నపాటివి కావొచ్చు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సెలబ్రిటీలు ఎంతో మంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎంపీ నక్కీరన్, లిబియా శ్రీజంటగా ఓ సినిమా షూటింగ్ కేరళలోని పాలక్కాడు అట్టప్పాడి ప్రాంతంలో చిత్రీకరణ జరుగుతోంది. ఓ సీన్ షూట్ లో భాగంగా హీరోయిన్ ఏకంగా కాలు జారి 100 అడుగుల లోయలో పడిపోయింది.
హీరోయిన్ ఓ చోట నిలబడి మాట్లాడుతోన్న సమయంలో లిబియా శ్రీ కాలు జారడంతో లోయలో పడింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో హీరో కూడా కాలు జారి పడ్డాడు. అయితే అన్ని అడుగుల లోతులో పడితే ప్రాణాలతో బయట పడటం అన్నది దాదాపు అసాధ్యం. కానీ ఆ జోడీ మాత్రం ప్రాణాలతో బయట పడ్డారు. చిన్నపాటి గాయాలతో ఇద్దర్నీ పైకి తాడు సహాయంతో తీసుకొచ్చారు. లోయ కింద నేలంతా పచ్చిగా ఉండటంతో? చిన్న చిన్న గాయలు మాత్రమే అయ్యాయి.
దీంతో హీరో-హీరోయిన్ ఇద్దరు ఎంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారో? తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి అనుకోని పరి స్థితుల్లో స్వల్ప గాయం అయింది. వెంటనే ఆయనకు అక్కడే వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అదృష్టవ శాత్తూ పెద్ద ప్రమాదం జరగలేదు. అంతకు ముందు యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న `ది ఇండియన్ హౌస్` సెట్స్ లో దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
శంషాబాద్ సమీపంలో జరుగుతుండగా, షూటింగ్ లో భాగంగా చిత్ర యూనిట్ ఓ భారీ వాటర్ ట్యాంక్ ను నిర్మించగా, ఆ ట్యాంక్ ఒక్కసారిగా కూలిపోవడంతో చిత్ర యూనిట్ లోని టెక్నికల్ టీమ్ గాయపడింది. `కాంతారా చాప్టర్ వన్` సినిమా షూటింగ్ సమయంలో కూడా అనుకోని ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రోజు చాలా సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయి. రిస్క్ షాట్స్ తీసే సమయంలో, యాక్షన్ సన్నివేశాల సమయంలో అనుకోని ఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిలో కొన్ని వెలుగులోకి వస్తుంటాయి. మరికొన్ని బయటకు రాకుండా కామ్ అప్ అవుతుంటాయి.
