Begin typing your search above and press return to search.

లియో దాస్ అలియాస్ పార్తీబ‌న్ లైన్ లోకా!

ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్ మళ్లీ కలిస్తే వచ్చే హైపే వేరుగా ఉంటుంది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దళపతి విజయ్‌ను- స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్న సంగతి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   27 May 2026 11:55 PM IST
లియో దాస్ అలియాస్ పార్తీబ‌న్ లైన్ లోకా!
X

ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్ మళ్లీ కలిస్తే వచ్చే హైపే వేరుగా ఉంటుంది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దళపతి విజయ్‌ను- స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్న సంగతి తెలిసిందే. ఇది స్నేహపూర్వక భేటీ మాత్రమే అయినా? సోషల్ మీడియాలో మాత్రం ఇదొక పెద్ద సినిమాటిక్ డిస్కషన్‌కు దారితీసింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు. ఇద్ద‌రి కాంబోలో రాబోయే `లియో` సీక్వెల్ డిస్క‌ష‌న్ వ‌చ్చిందా? అన్న సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

గ‌తంలో ఇద్ద‌రి కాంబినేష‌న్ లో రిలీజ్ అయిన `లియో` బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. హింసాత్మక గతాన్ని దాచుకుని కుటుంబం కోసం పార్తీబన్ అనే సాదాసీదా కాఫీ షాప్ యజమానిగా లైఫ్ లీడ్ చేసిన‌ గ్యాంగ్‌స్టర్ కథ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. లియో దాస్ అలియాస్ పార్తీబన్ అనే డ్యూయల్ షేడ్ క్యారెక్ట రైజేషన్ సినిమా ముగింపులో లోకేష్ వదిలిన ఎల్సీయూ కనెక్టింగ్ లింకులు.. ఖచ్చితంగా దీనికి రెండో భాగం ఉంటుందనే బలమైన నమ్మకాన్ని అప్పట్లోనే కలిగించాయి. ఈ క్రమంలోనే లోకేష్ కనగరాజ్ `లియో` చిత్రానికి సీక్వెల్ తీస్తే దానికి `లియో 2` కాకుండా `పార్తీబన్` అనే టైటిల్‌తోనే సినిమా ఉంటుందని లోకేష్ గతంలొనే స్పష్టం చేశారు. గ్యాంగ్‌స్టర్ లియో దాస్ ఇమేజ్ కంటే తన ఐడెంటిటీని దాచుకుంటూ కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాడే పార్తీబన్ అంతరంగమే ఆ సీక్వెల్‌కు ప్రధాన బలం కానుందని టైటిల్ ద్వారా లోకేష్ హింట్ ఇచ్చారు.

తాజా భేటీతో పార్తీబన్ లైన్ మళ్లీ ట్రెండింగ్‌గా మారింది. అయితే ప్రస్తుత సమీకరణాలను గమనిస్తే పార్తీబన్ సినిమా సాధ్యమేనా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నటుడిగా అత్యున్నత శిఖరాల్లో ఉన్న విజయ్ ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజాసేవకే అంకితమై తమిళనాడు సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చే ముందే తాను సినిమాలకు పూర్తి గుడ్‌బై చెప్తానని ఆయన ప్రకటించిన నేపథ్యంలో మళ్లీ మెగాఫోన్ పట్టి లోకేష్‌తో సినిమా చేయడం అనేది ప్రస్తుతానికి పెద్ద ప్రశ్నార్థకమే.

అయినా? రాజకీయాల్లో ఉంటూనే అభిమానుల కోసం స్పెషల్ లాస్ట్ ప్రాజెక్ట్ చేయకూడదా అనే ఆశ నెటిజన్లలో లేకపోలేదు. ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే లోకేష్ కనగరాజ్ స్క్రీన్‌ప్లేలో పెట్టే ప్రతి చిన్న డీటెయి లింగ్‌లోనూ ఏదో ఒక సస్పెన్స్ దాగి ఉంటుంది. అందుకే ఇద్దరి కలయిక వెనుక రాజకీయ అభినందనలు మాత్రమే లేవని పార్తీబన్ స్క్రిప్ట్ లైన్‌కు సంబంధించిన చర్చలు కూడా జ‌రిగే ఉండొచ్చ‌ని నెటిజన్లు థియరీలు అల్లే స్తున్నారు. తాజా భేటీ మాత్రం అటు సినిమా ప్రపంచాన్ని, ఇటు రాజకీయ రంగాన్ని ఒక్క‌సారిగా ఆకర్షించింది. భవిష్యత్తులో పార్తీబన్ అనే ప్రాజెక్ట్ పట్టాలెక్కినా లేక‌పోయినా? ఇది అద్భుతమైన అన్‌ఫుల్‌ఫిల్డ్ డ్రీమ్‌గా మిగిలిపోయినా? లియో దాస్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం కోలీవుడ్ చరిత్రలో చెరిగిపోనిది. సీఎం హోదాలో విజయ్ సాధించబోయే విజయాలకు- వెండితెరపై లోకేష్ సృష్టించబోయే నెక్స్ట్ లెవెల్ వండర్స్‌కు ఈ భేటీ సానుకూల సంకేతంగా నిలుస్తుందని చెప్పొచ్చు.