అఖిల్ 'లెనిన్'.. రెండు రోజుల లెక్క ఎంతంటే?
మేకర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, లెనిన్ మూవీ రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.37.2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.
By: M Prashanth | 12 July 2026 12:42 PM ISTఅక్కినేని అఖిల్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ లెనిన్ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ గా దూసుకుపోతోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఆ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. అదే జోష్ రెండో రోజు కూడా కొనసాగడంతో సినిమా వసూళ్లు మరింత పెరిగాయి. రెండు రోజుల కలెక్షన్లను మూవీ నిర్మాణ సంస్థలు అధికారికంగా అనౌన్స్ చేశాయి.
మేకర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, లెనిన్ మూవీ రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.37.2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ టాక్, మౌత్ పబ్లిసిటీ సినిమాకు పెద్ద బలంగా మారిందని మేకర్స్ తెలిపారు. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ రేంజ్ వసూళ్లు రావడం మూవీ టీమ్ లో ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి.
శుక్రవారం విడుదలైన ఆ సినిమా తొలి రోజే మంచి ఓపెనింగ్స్ నమోదు చేసింది. ఆ తర్వాత శనివారం వీకెండ్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ తో యూత్ కూడా థియేటర్లకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా ఈవెనింగ్, నైట్ షోలకు సూపర్ రెస్పాన్స్ కనిపించడంతో ఆక్యుపెన్సీ శాతం కూడా పెరిగినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అందుకే ఫస్ట్ డే కన్నా రెండు రోజు పెరిగాయని అంటున్నారు.
అఖిల్ కెరీర్ లో లెనిన్ సినిమాకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది. గత చిత్రాల రిజల్ట్స్ తర్వాత సరైన విజయాన్ని అందుకోవాలన్న టార్గెట్ తో ఆయన ఆ ప్రాజెక్ట్ ను చిన్న గ్యాప్ తర్వాత సెలెక్ట్ చేసుకున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన కథ, మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ మిక్స్ చేసిన స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని సినీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.
సినిమాలో అఖిల్ యాక్టింగ్ కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా ఆయన తన పాత్రను సరైన విధంగా డీల్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హీరోనే భాగ్యశ్రీ బోర్సే తన పాత్రకు న్యాయం చేయగా, ఇతర క్యాస్టింగ్ కూడా కథకు బలం చేకూర్చారని ప్రేక్షకులు చెబుతున్నారు. సినిమాలోని ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లైమాక్స్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ అందించిన వాయిస్ ఓవర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఆ అంశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయని చెప్పాలి. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు కథను కమర్షియల్ అంశాలతో మిక్స్ చేసి తెరకెక్కించిన తీరు సినిమాకు ప్లస్ గా మారిందని సినీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు, కథలోని ట్విస్టులు ప్రేక్షకులను థియేటర్లలో అలరిస్తున్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో మూవీ ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతుండగా, ఆదివారం కూడా ఇదే స్థాయిలో ప్రేక్షకుల స్పందన కొనసాగితే వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. రెండు రోజుల్లో రూ.37.2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేయడంతో లెనిన్ జర్నీ స్ట్రాంగ్ గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
