Begin typing your search above and press return to search.

అక్కినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

విన‌రో భాగ్యం విష్ణుక‌థ ఫేమ్ ముర‌ళీ కిషోర్ అబ్బూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను అన్న‌పూర్ణ స్టూడియోస్, సితార ఎంట‌ర్టైన్మెంట‌స్ బ్యాన‌ర్ల‌లో అక్కినేని నాగార్జున‌, నాగ‌వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   1 Jan 2026 10:34 PM IST
అక్కినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..
X

అక్కినేని హీరో అఖిల్ న‌టిస్తున్న తాజా యాక్ష‌న్ మూవీ లెనిన్. విన‌రో భాగ్యం విష్ణుక‌థ ఫేమ్ ముర‌ళీ కిషోర్ అబ్బూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను అన్న‌పూర్ణ స్టూడియోస్, సితార ఎంట‌ర్టైన్మెంట‌స్ బ్యాన‌ర్ల‌లో అక్కినేని నాగార్జున‌, నాగ‌వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీపై అక్కినేని ఫ్యాన్స్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు.




జ‌న‌వ‌రి 5న లెనిన్ ఫ‌స్ట్ సింగిల్

ఈ మూవీలో అఖిల్ మాస్ క్యారెక్ట‌ర్ లో క‌నిపించ‌నున్నార‌ని ఆల్రెడీ టైటిల్ గ్లింప్స్ చూస్తే క్లారిటీ వ‌చ్చింది. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి మేక‌ర్స్ ఇప్పుడో ఎగ్జైటింగ్ అప్డేట్ ను అందించారు. లెనిన్ మూవీ ఫ‌స్ట్ సింగిల్ గురించి చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియాలో అప్డేట్ ను ఇచ్చింది. జ‌న‌వ‌రి 5వ తేదీన లెనిన్ నుంచి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ కానుందని, సినిమా ఈ ఇయ‌ర్ స‌మ్మ‌ర్ లో రిలీజ్ కానుంద‌ని ఓ పోస్ట‌ర్ ద్వారా అనౌన్స్ చేయ‌గా ఈ వార్త తెలుసుకుని అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

లెనిన్ డిజప్పాయింట్ చేయ‌దు

ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ సినిమా గురించి నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. లెనిన్ మూవీ చాలా బాగా వ‌స్తుంద‌ని, సినిమాను ఈ ఇయ‌ర్ మార్చిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. లెనిన్ మూవీ చూశాక అక్కినేని ఫ్యాన్స్ ఎవ‌రూ డిజ‌ప్పాయింట్ అవ‌ర‌ని, ఈ మూవీ కంటెంట్ విష‌యంలో తాము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న‌ట్టు వంశీ తెలిపారు.

అఖిల్ కు కీల‌కంగా మారిన లెనిన్ స‌క్సెస్

అయితే ఈ సినిమా స‌క్సెస్ అఖిల్ కెరీర్ కు ఎంతో కీల‌కం. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు అఖిల్ ఖాతాలో ఒక్క సాలిడ్ హిట్ కూడా లేదు. ఏజెంట్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌నుకుంటే అది టాలీవుడ్ లోని భారీ డిజాస్ట‌ర్ల‌లో ఒక‌టిగా నిలిచింది. అందుకే అఖిల్ కూడా ఈ సినిమా కోసం ఎంతో క‌సిగా వ‌ర్క్ చేస్తున్నారు. లెనిన్ లో త‌న క్యారెక్ట‌ర్ కోసం లుక్, బాడీ లాంగ్వేజ్ ను కూడా మార్చుకుని పూర్తిగా మేకోవ‌ర్ అయ్యారు అఖిల్. భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమా రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతుండ‌గా, త‌మ‌న్ ఈ మూవీకి మ్యూజిక్ ను అందిస్తున్నారు.