సీనియర్ సింగర్ కే షాక్ ఇచ్చిన సామాన్యురాలు!
ప్రముఖ గాయని ఉషా ఉతుప్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె మైక్ పట్టారంటే వేదిక దద్దరిల్లిపోతుంది.ఏ భాషలోనైనా..ఎలాంటి పాటతోనైనా ఉర్రూతలూగించడం ఉషా ప్రత్యేకత.
By: Srikanth Kontham | 19 Nov 2025 7:00 PM ISTప్రముఖ గాయని ఉషా ఉతుప్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె మైక్ పట్టారంటే వేదిక దద్దరిల్లిపోతుంది.ఏ భాషలోనైనా..ఎలాంటి పాటతోనైనా ఉర్రూతలూగించడం ఉషా ప్రత్యేకత. క్లాసికల్ అయినా..వెస్ట్రన్ అయినా? మైక్ పట్టారంటే రణరంగమే. అన్ని వయస్కుల వారు ఉషా గాత్రానికి స్టెప్ అందుకోవాల్సిందే. గొంతుతోనే మాయ చేయ గల గొప్ప గాయని. దాదాపు అన్ని భాషల్లో పాటలు పాడిన ఓ లెజెండరీ సింగర్ ఆవిడ. అంత ఫేమస్ సింగర్ ని ఎవరనా గుర్తు పట్టకుండా ఉంటారా? కనిపిస్తే వెళ్లి ఓ సెల్పీ తీసుకుందామనుకుంటారు ఎవరైనా? కుదిరితే కాసేపు మాట్లాడాలనిపిస్తుంది.
ఇంకా సమయం కేటాయిస్తే ఇంకాస్త మాట్లాడి ఫోన్ నెంబర్ అడగాలినిపిస్తుంది. అలాంటి లెజెండరీ సింగర్ ను ఓ మహిళ గుర్తు పట్టలేదు. ఈ విషయాన్ని ఉషా ఉతుప్ తాజాగా రివీల్ చేసారు. `ఓసారి ఓ అమ్మాయి తన ఫోన్ చేతిలో పట్టుకుని రెండు..మూడు సార్లు నా పక్కనే నడిచింది. దీంతో ఆమె నాతో సెల్పీ తీసుకోవాలని అక్కడ తిరుగు తుందనుకున్నా. నేను కూడా సెల్పీ కి రెడీ అయ్యాను. చీర సర్దుకున్నాను. దీంతో మూడవ సారి ఆమె నా దగ్గరకు వచ్చి నువ్వు సింగర్ రూనా లైలానా? అని అడిగింది. కాదు నా పేరు ఉషా ఉతుప్ అని చెప్పాను.
అప్పుడామె అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయింది. కనీసం సెల్పీ కూడా తీసుకోలేదు. అప్పుడప్పుడు ఇలాంటి జరుగుతుంటాయి. అందుకే మిమ్మల్ని మీరు కూడా సీరియస్ గా తీసుకోకండి. నేను కూడా ఇలాగే ఉంటాను. అందర్నీ ఇదే అనుసరించమని చెబుతా. నేనే గొప్ప అనుకోవడంలో తప్పులేదు. కానీ అది ఎంతో హుందాగా ఉన్నప్పుడే బాగుంటుందన్నారు. తెరపై కనిపించే వారికున్న ఫాలోయింగ్ తెర వెనుక ఉన్న వారికి ఉండదన్నది తెలిసిందే. ఒకప్పుడు కేవలం హీరోలను మాత్రమే ఎంతో గొప్పగా చూసేవారు. వాళ్లే గొప్ప అనుకునేవారు అభిమానులు.
కానీ కాలంతో పాటు వచ్చిన మార్పులతో చాలా విషయాలు తెలుసుకుంటున్నారు. నేడు హీరోలకు ధీటుగా దర్శకులకు ఫాలోయింగ్ ఏర్పడుతుంది. సోషల్ మీడియా యుగం కావడంతో? ఎవరు ఏంటి? అన్నది సులభంగా తెలుస్తుంది. దీంతో సినిమా వాళ్లు అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతుంది. ఒకప్పుడు సినిమా వాళ్లు అంటే ఎంతో చిన్నచూప భావన ఉండేది సమాజంలో. కానీ ఇప్పుడది చెరిగిపోయింది. మంచి సినిమాలు తీసి సక్సస్ అయితే వచ్చే గుర్తింపు ఎంతో ప్రత్యేకమైనది. వారసులతో పాటు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లకు కూడా మంచి గుర్తింపు దక్కుతుంది.
