టాలీవుడ్‌లో కొత్త జంట.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న క్రేజీ పెయిర్!
తెలుగు సినీ పరిశ్రమలో మరో పెళ్లి వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి ట్రెండింగ్ లో నిలిచిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 11 March 2026 3:10 PM ISTతెలుగు సినీ పరిశ్రమలో మరో పెళ్లి వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి ట్రెండింగ్ లో నిలిచిన విషయం తెలిసిందే. అలాగే బెల్లంకొండ వారి ఇంట్లో కూడా హడావుడి మొదలైంది. ఇక ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడి ఇంట కూడా పెళ్లి బాజాలు షురూ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడి కుమారుడు, ఒక యువ నటి త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కాబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, ఇప్పుడు ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లికి సిద్ధమవుతున్నారని సమాచారం. అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకముందే ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సదరు యువకుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా రానిస్తూ తండ్రి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.
మరోవైపు ఆ యువ నటి బాలనటిగా కెరీర్ ప్రారంభించి, ఇటీవల వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉంది. కథా బలమున్న సినిమాలను ఎంచుకుంటూ తన నటనతో తక్కువ సమయంలోనే గుర్తింపు పొందింది. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా స్నేహం ఉందని, అది కాస్తా ప్రేమగా మారిందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇటు గాయకుడు కానీ, అటు నటి కానీ ఎక్కడా బయటపెట్టలేదు.
వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి చాలామంది ఇది స్నేహమే అనుకున్నారు. కానీ ఇటీవల వీరి పెళ్లికి సంబంధించిన చర్చలు ఇరు కుటుంబాల మధ్య జరిగాయని, అతి త్వరలోనే ఒక శుభ ముహూర్తాన్ని ఖరారు చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఇటువంటి పుకార్లు రావడం సహజమే అయినప్పటికీ, ఈసారి మాత్రం ఈ జంట గురించి వస్తున్న వార్తలు చాలా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడి కుటుంబం నుంచి ఈ విషయంలో ఎటువంటి క్లారిటీ రాకపోవడం కూడా ఈ విషయం మరింత వైరల్ అవుతోంది.
సినీ పెద్దల సమక్షంలో వీరి నిశ్చితార్థం చాలా సింపుల్‌గా నిర్వహించి, ఆ తర్వాతే అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి వారి కెరీర్‌లో కూడా మంచి స్థాయిలో ఉండటంతో, ఇదే సరైన సమయమని కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, ఈ క్రేజీ పెయిర్ తమ పెళ్లి గురించి ఎప్పుడు స్పందిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ పెళ్లి వార్తపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
