వారసులిద్దరు కోటి ఆశలతో రంగంలోకి!
తాజాగా ఓ ఇద్దరు వారసులు అలాగే శ్రమిస్తు న్నారు. సాయి కమార్ వారసత్వంతో ఆది సాయికుమార్ హీరోగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 23 Dec 2025 11:40 PM ISTఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ సహజం. లాంచింగ్ పరంగా పెద్దగా ఇబ్బందులు ఎదురవ్వవు. తాతలు..తండ్రుల ఇమేజ్ తో లాంచ్ అవ్వడం సులభమే. ఆ తర్వాత వాళ్లంతా ట్యాలెంట్ తో బయటకు రావాల్సి ఉంటుంది. ఇండస్ట్రీ లో సక్సెస్ అయిన వారసులంతా కూడా అలా ఎదిగిన వారే. మహేష్, రామ్ చరణ్, బన్నీ, ఎన్టీఆర్, ప్రభాస్ అంతా ఎంతో కష్టపడి సక్సస్ అయిన వారే. కాకపోతే ఆ కష్టం కూడా అందరికీ కలిసి రాదు. కొందరికి కలిసొస్తుం ది..మరికొంత మంది విషయంలో అది జరగడం ఆలస్యమవుతుంది. తాజాగా ఓ ఇద్దరు వారసులు అలాగే శ్రమిస్తు న్నారు. సాయి కమార్ వారసత్వంతో ఆది సాయికుమార్ హీరోగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
`ప్రేమ కావాలి`తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది అటుపై `లవ్లీ` సినిమాతో మరో విజయం అందుకున్నాడు. ఆది కెరీర్ లో అదే చివరి హిట్ కూడా. ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. రకరకాల ప్రయోగాలు చేసాడు. కానీ ఏవీ కలిసి రాలేదు. వరుస పరాజయాలతో కనీసం పోటీలో కూడా లేకుండా పోయాడు. అతడి సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. చాలా కాలం తర్వాత మళ్లీ `షంబాల` అంటూ బాగానే హైప్ ఇచ్చాడు. డిఫరెంట్ జానర్ లో ట్రై చేసిన చిత్రమిది. ప్రచార చిత్రాలు మంచి బజ్ ను తీసుకొచ్చాయి.
ప్రచారం కూడా భారీగానే చేసారు. దీంతో సినిమా జనాలకు రీచ్ అయింది. ఇకపై ఆది సక్సెస్ అవ్వాల్సింది థియేటర్లోనే. తొలి షో అనంతరం టాక్ పాజిటివ్ గా వచ్చిందంటే ఆది గట్టెక్కినట్లే. ఈ సినిమా విజయం కూడా చాలా కీలకం. ఈ విజయంపై సాయి కుమార్ కూడా చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. గట్టిగా కొడుతున్నాం అంటూ తన నమ్మకాన్ని బాహాటంగానే వ్యక్తం చేసారు. అదే రోజున ఛార్మింగ్ స్టార్ శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన `ఛాంపియన్` కూడా రిలీజ్ అవుతుంది. పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించారు.
రోషన్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ కూడా ప్రచారం పరంగా సహాయం చేసారు. దీంతో సినిమాకు మంచి రీచ్ దక్కింది. వ్యక్తిగతంగా నిర్మాతలు కూడా బాగానే ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వినూత్న ప్రచారం టీమ్ కు ఎంతో కలిసొచ్చింది. ఈ సినిమా విషయంలో శ్రీకాంత్ కూడా చాలా కాన్పిడెంట్ గా కని పిస్తున్నాడు. రోషన్ కి ఈ సినిమాతో మంచి పేరొస్తుందని అంటున్నారు. మరి ఈ వారసులిద్దరు క్రిస్మస్ కి ప్రేక్షకుల్ని ఏ మేర అలరిస్తారో చూడాలి.
