వివాహం అనంతరం మెగా కోడలి తొలి సినిమా!
మెగా కోడలు లావణ్య త్రిపాఠి వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. మంచి కథలు..లేడీ ఓరియేంటెడ్ కాన్సెప్ట్ లు అయితే తప్ప కొత్త చిత్రాలేవి కమిట్ అవ్వడం లేదు.
By: Srikanth Kontham | 3 Sept 2025 6:00 AM ISTమెగా కోడలు లావణ్య త్రిపాఠి వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. మంచి కథలు..లేడీ ఓరియేంటెడ్ కాన్సెప్ట్ లు అయితే తప్ప కొత్త చిత్రాలేవి కమిట్ అవ్వడం లేదు. అలా కమిట్ అయిన చిత్రమే `సతీలీలావతి`. ప్రస్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఎప్పుడు రిలీజ్ అవు తుంది? అన్నది క్లారిటీలేదు. మరి ఇప్పట్లో లావణ్య ను వెండి తెరపై చూసే అవకాశం లేదా? అంటే ఓ అనువాద చిత్రంతో అందుకు ఆస్కారం ఉంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన `టన్నెల్` త్వరలో రిలీజ్ అవుతుంది.
ఇదొక తమిళ అనువద చిత్రం. ఇందులో అధర్వ హీరోగా నటిస్తున్నాడు. ఈసినిమా ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఇందులో లావణ్య పాత్ర ఎలా ఉంటుంది? అన్నది చూడాలి. పెళ్లైన తర్వాత రిలీజ్ అవుతోన్న మొట్ట మొదటి చిత్రమిదే. పెళ్లికి ముందు `హ్యాపీ బర్త్ డే` అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అప్పటి నుంచి లావణ్య తెరపై కనిపించలేదు. `టన్నెల్` కూడా వరుణ్ తేజ్ తో పెళ్లికి ముందు కమిట్ అయిన చిత్రం. ఆ సినిమా కమిట్ అయిన తర్వాత ప్రారంభమవ్వడం..రిలీజ్ అవ్వడం ఆలస్యంగా జరుగుతున్నాయి.
మరి ఈ సినిమాతో లావణ్య ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి. చేతిలో ఉన్నది కూడా ఈ ఒక్క చిత్రమే. వివాహం తర్వాత ఆమె కూడా సినిమాలంటే అంత ఆసక్తి చూపించలేదు. కుటుంబ జీవితానికే పరిమితమైంది. ప్రస్తుతం లావణ్య గర్భవతి. త్వరలోనే ఓ బేబికి జన్మనివ్వబోతుంది. అమ్మగా బాధ్యతలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో లావణ్య ఇప్పట్లో సినిమాలు చేసే అవకాశం కూడా లేదని తెలుస్తోంది. ఇటీవలే వినాయక చవితి సందర్భంగా పూజా కార్యక్రమాలకు సంబంధించి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.
నటిగా లావణ్యకు ఎలాంటి పరిమితులు లేవు. మెగా ఫ్యామిలీ తనకు కావాల్సిన అన్ని రకాల స్వేచ్ఛలు కల్పించినా? తాను అంతే హుందాగా మెలుగుతున్నారు. కథల విషయంలో మరింత జాగ్రత్త గా ఉంటు న్నారు. కెరీర్ ఆరంభం నుంచి లావణ్య గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆమె ఆ లక్షణమే మిగతా నటీమణుల నుంచి వేరు చేస్తుంది. పెళ్లికి ముందు వరుణ్ తేజ్ తో కలిసి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.
